అలా చెబితే నేను ముసలోడిని అయ్యానంటారు.. ఎన్టీఆర్ కామెంట్ల వెనుక అర్థం ఇదే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సెట్స్ లో చాలా సరదాగా ఉంటారని ఈ హీరోతో పని చేసిన నటీనటులు, టెక్నీషియన్స్ చెబుతూ ఉంటారు.

మూడేళ్లుగా తారక్ నటించిన ఒక్క సినిమా కూడా థియేటర్లలో విడుదల కాకపోయినా ఎన్టీఆర్ కు క్రేజ్ పెరిగిందే తప్ప తగ్గలేదు.

ఎన్టీఆర్ కొమురం భీమ్ రోల్ లో నటించిన ఆర్ఆర్ఆర్ కరోనా కేసులు తగ్గి థియేటర్ల విషయంలో ఆంక్షలు తొలగించిన తర్వాత విడుదల కానుంది.రిలీజ్ డేట్ ను ప్రకటించిన కొన్నిరోజుల గ్యాప్ లోనే సినిమాను విడుదల చేయాలని ఆర్ఆర్ఆర్ మేకర్స్ అనుకుంటున్నారు.

కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా షూటింగ్ మొదలయ్యే వరకు ఎన్టీఆర్ రెస్ట్ తీసుకోనున్నారు.అయితే తాజాగా ఈ హీరో చేతులమీదుగా రౌడీ బాయ్స్ మూవీ ట్రైలర్ విడుదలైంది.

ఈ ట్రైలర్ లాంఛ్ సమయంలో ఎన్టీఆర్ చేసిన ఫన్నీ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.రౌడీ బాయ్స్ సినిమాలో హీరోగా నటించిన అశీష్ తాను ఆది సినిమా చేసే సమయంలో చిన్న పిల్లాడని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

Advertisement

అశీష్ గురించి అలా చెబితే తాను ముసలోడిని అయ్యానని భావించాల్సి వస్తుందని తారక్ తనపై తాను పంచ్ వేసుకున్నారు.రౌడీ బాయ్స్ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని ఎన్టీఆర్ తెలిపారు.దిల్ రాజు సోదరుడు శిరీష్ కొడుకు అశీష్ రౌడీ బాయ్స్ సినిమాతో లక్ పరీక్షించుకోనున్నారు.

అశీష్ కు తొలి సినిమాతోనే సక్సెస్ దక్కేలా దిల్ రాజు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.రౌడీ బాయ్స్ ట్రైలర్ ను చూసిన తారక్ ఈ ట్రైలర్ లో ప్రేమదేశం వైబ్స్ కనిపిస్తున్నాయంటూ పాజిటివ్ గా కామెంట్లు చేయడం గమనార్హం.అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా సరైన సక్సెస్ లేని అనుపమ రౌడీ బాయ్స్ పైనే ఆశలు పెట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు