5 అంతస్తుల పైనుంచి స్విమ్మింగ్ పూల్‌లోకి దూకిన యువకులు.. తర్వాతేమైందో చూడండి..

చాలా ఎత్తు నుంచి నీటిలోకి దూకడం చాలా ప్రమాదకరం.ఇక అయిదంతస్తుల ఎత్తు పైనుంచి జంప్ చేస్తే ప్రాణాంతక గాయాలయ్యే ప్రమాదం కూడా ఉంది.

కానీ కొందరు కొన్ని టెక్నిక్స్‌తో చాలా ఎత్తు పైనుంచి స్విమ్మింగ్ పూల్స్ లో( Swimming Pool ) దూకి చిన్న దెబ్బ కూడా తగలకుండా తప్పించుకోగలుగుతారు.తాజాగా వైరల్‌ అవుతున్న వీడియోలో కొందరు యువకులు కూడా దాదాపు 5 అంతస్థల ఎత్తున హోటల్ పైనుంచి కింద ఉన్న స్విమ్మింగ్ పూల్ లోకి దూకారు.

ఆ తర్వాత చాలా క్షేమంగా అక్కడి నుంచి పారిపోయారు.

ఈ వీడియోను ప్రముఖ ట్విట్టర్ పేజీ @సీసీటీవీ ఇడియట్స్‌ షేర్ చేసింది.షేర్ చేసిన సమయం నుంచి దీనికి రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ వైరల్ వీడియో( Viral Video ) ఓపెన్ చేస్తే మనకు ఒక పోలీస్ సరైన్ బ్యాక్‌గ్రౌండ్ లో వినిపిస్తుంది.

Advertisement

అలాగే హోటల్ రూఫ్ పైన( Hotel Roof ) పరిగెడుతున్న కొందరు యువకులు కనిపిస్తారు.అనంతరం వారు కింద ఉన్న ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ లో దిగుతారు.

ఆపై అందులో నుంచి బయటపడి పారిపోయారు.ఈ దృశ్యాలు చూసేందుకు షాకింగ్‌గా అనిపించాయి.

ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు ఇది చాలా డేంజరస్ అని కామెంట్లు చేస్తున్నారు.వారు అంత పెద్ద ఎత్తునుంచి దూకడం వల్ల పూల్‌లో చాలా పెద్ద అలలు వచ్చి ఉంటాయని ఒకరు అన్నారు.కోటి రూపాయలు ఇచ్చినా ఈ పని చేయమని ఇంకొందరు నెటిజన్లు పేర్కొన్నారు.

ఇది ఎన్నడూ ఎవరూ ట్రై చేయకూడదని మరికొందరు సలహా ఇచ్చారు.మొత్తం మీద ఈ వైరల్ వీడియో చర్చనీయాంశం అయింది.

Blackjack Variants & All Blacks Betting : A Practical Guide For NZ Punters
మైదా పిండిని ఎలా తయారు చేస్తారు.. ఆరోగ్యానికి అది ఎందుకు మంచిది కాదు?

దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.

Advertisement

తాజా వార్తలు