లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ అయింది.

ఈ మేరకు ఢిల్లీ లిక్కర్ పాలసీ( Delhi Liquor Policy ) సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) విచారణ జరిపింది.

ఈ క్రమంలోనే బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం వచ్చే నెల 2వ తేదీన తీర్పును వెల్లడించనుంది.అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

కాగా లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు మార్చి 15న అరెస్ట్ చేసింది.తరువాత జైలులో ఉన్న కవితను ఇదే కేసులో ఏప్రిల్ 11న సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

దీంతో ఆమె ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారన్న సంగతి తెలిసిందే.కవిత జ్యుడీషియల్ రిమాండ్ రేపటితో ముగియనుంది.

Advertisement
ఇదేం శ్యాడిజం.. స్కూటీని ఢీ కొట్టడమే కాకుండా అమాంతం ఈడ్చుకెళ్లిన కారు..

తాజా వార్తలు