జొన్న రోటీ వర్సెస్ గోధుమ రోటీ.. ఆరోగ్యానికి ఈ రెండిటిలో ఏది బెస్ట్..?

భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు రోటీలు ప్రధాన ఆహారంగా మారాయి.అయితే కొన్ని ప్రాంతాల్లో రోటీలను గోధుమపిండితో చేస్తే.

కొన్ని ప్రాంతాల్లో జొన్న పిండితో చేస్తారు.జొన్న రోటీ( Jowar Roti ) మరియు గోధుమ రోటీల్లో( Wheat Roti ) ఆరోగ్యానికి ఏది బెస్ట్ అనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.

నిజానికి గోధుమ రోటీ మరియు జొన్న రోటీ రెండూ ఆరోగ్యకరమైనవే.గోధుమ రోటీలు తినడం వల్ల మధుమేహం,( Diabetes ) గుండె జబ్బులు వ‌చ్చే ప్రమాదం తగ్గుతుంది.

గోధుమల్లో కరిగే మరియు కరగని రెండు రకాల ఫైబర్ ఉంటుంది.కరిగే ఫైబర్ గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Advertisement

అలాగే గోధుమ రోటీలు జీర్ణాశయం, పేగు ఆరోగ్యాన్ని కాపాడతాయి.బరువు తగ్గడానికి( Weight Loss ) మద్దతు ఇస్తాయి.ఐరన్ జింక్ విటమిన్ బి వంటి పోషకాలను కూడా గోధుమ రోటీల ద్వారా పొందవచ్చు

ఇక జొన్న రోటీల విషయానికి వస్తే.ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అద్భుతంగా సహాయపడతాయి.అలాగే జొన్న రోటీల్లో అధిక ఫైబర్ కంటెంట్ మిమ్మల్ని ఎక్కువ కాలం సంతృప్తిగా ఉంచుతుంది, ఆహార కోరికలను తగ్గిస్తుంది మరియు అతిగా తినడాన్ని పరిమితం చేస్తుంది.

ఐరన్, కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం వంటి పోషకాలు జొన్న రోటీ లో పుష్కలంగా ఉంటాయి.వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

ఆరోగ్యపరంగా జొన్న రోటీలు మరియు గోధుమ రోటీలు రెండు మంచివే.కానీ గోధుమలలో గ్లూటెన్( Gluten ) ఉంటుంది, ఇది ఉదరకుహర వ్యాధి లేదా గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారికి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.అలాగే కొంత మంది వ్యక్తులు గోధుమ అలెర్జీ కలిగి ఉండవచ్చు.

కొబ్బరి నీళ్లల్లో ఇవి కలిపి రాసారంటే మీ ముఖం మరింత ప్రకాశంవంతంగా మెరిసిపోవడం ఖాయం..!
నాకు గ్రీన్ కార్డ్ దక్కుతుందా .. భారత సంతతి సీఈవో ఆందోళన, ఎలాన్ మస్క్ రియాక్షన్

దురద, దద్దుర్లు లేదా జీర్ణశయాంతర సమస్యలు వంటి లక్షణాలను ఫేస్ చేస్తుంటారు.అలాంటి వారు గోధుమ రోటీలు మ‌రియు ఇత‌ర గోధ‌మ ఆహారాలు తిన‌కూడ‌దు.

Advertisement

ఇక‌పోతే జొన్నలు గ్లూటెన్ రహిత ధాన్యం.ఉదరకుహర వ్యాధి లేదా గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్న వ్యక్తులకు జొన్న రొటీలు ప‌ర్ఫెక్ట్ ఛాయిస్ అవుతాయి.

తాజా వార్తలు