అమెరికాలో కరోనా “జాన్ హోప్కిన్స్ యూనివర్సిటీ” సంచలన కథనం..!!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా చేస్తున్న విలయానికి ప్రజలు అల్లల్లాడి పోతున్నారు.అగ్ర రాజ్యం అమెరికా పరిస్థితి రోజు రోజుకి ఆందోళన కరంగా మారుతోంది.

ఒక్క రోజులోనే వేల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రభుత్వానికి ఏమి చేయాలో కూడా పాలుపోని పరిస్థితి ఏర్పడింది.కరోనా సమయంలో లాక్ డౌన్ ఎత్తివేయడంతోనే కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయిందని.

లాక్ డౌన్ ఎత్తివేయాలనే నిర్ణయం సరైనది కాదని ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు అధికారులు.అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రస్తుతం అమెరికాలో దాదాపు అన్ని రాష్ట్రాలలో మళ్ళీ లాక్ డౌన్ విధించారు ఇదిలాఉంటే.

అమెరికాలో కరోనా ఎంట్రీ ఇచ్చింది మొదలు ఇప్పటి వరకూ ఎలాంటి పరిణామాలు జరిగాయి, ఎంతమందిని కరోనా మహమ్మారి పొట్టన పెట్టుకుంది, ఎంతమంది మృతి చెందారు అనే విషయంపై సర్వే చేపట్టిన ప్రఖ్యాత జాన్ హోప్కిన్స్ యూనివర్సిటీ పూర్తి స్థాయిలో నివేదిక ప్రకటించింది.కరోనా మరణాలలో అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఎంతో తీవ్ర,మైన ప్రాణ ఆర్ధిక నష్టాన్ని చవిచూశాయని తెలిపారు.కరోనా వచ్చింది మొదలు ఇప్పటి వరకూ అమెరికా వ్యాప్తంగా సుమారు 3.5 మిలియన్ ప్రజలు ఈ కరోనా కోరల్లో చిక్కుకున్నారని తెలిపారు.

Johns Hopkins University Survey, Corona Virus, Corona Effect, America, White Ho
Advertisement
Johns Hopkins University Survey, Corona Virus, Corona Effect, America, White Ho

కరోనా కారణంగా ఇప్పటి వరకూ మృతి చెందినవారు 1.37 లక్షలమందిగా ఉన్నారని తెలిపారు.సుమారు 18 రాష్ట్రాలలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్ ప్రకటించింది.

దాంతో పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ నిభందనలు మరింత కటినతరం చేశారు.అయితే గతంలో లాక్ డౌన్ఎత్తివేయడం వలనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయని తాజాగా సుమారు 68 వేల మంది అమెరికా పౌరులకు కరోనా పాజిటివ్ నమోదయ్యిందని యూనివర్సిటీ ఓ నివేదికలో తెలిపింది.

Advertisement

తాజా వార్తలు