అరియనాకి ఐ లవ్యూ చెప్పిన జెస్సీ.. చూడగానే ప్రేమలో పడిపోయానంటూ షాక్?

బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ఎంతో వినోదాన్ని పంచుతూ సీజన్లలో ప్రసారమవుతుంది.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ ప్రస్తుతం ఐదవ సీజన్ ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతుందని చెప్పవచ్చు.

గత రెండు సీజన్లో నుంచి ఎవరైతే ఈ కార్యక్రమంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారో వారు బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి వెళ్తారు.ఇలా ఈ కార్యక్రమంలో హోస్ట్ అడిగే ప్రశ్నలకు పలు సమాధానాలు చెబుతూ ఉంటారు.

ఇక ఈ సీజన్లో బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి అరియానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన 9 మందిని ఇంటర్వ్యూ చేసిన ఈమె హౌస్ లో ఉన్న సభ్యుల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నారు.

ఈ క్రమంలోనే 10వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన జెస్సి బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అరీయాన తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియోని షేర్ చేశారు.

Jessie Says I Love You To Ariyana In Bigg Boss Buzz Show Details, Bigg Boss 5,
Advertisement
Jessie Says I Love You To Ariyana In Bigg Boss Buzz Show Details, Bigg Boss 5,

ఇవాళ బిగ్ బాస్ ఈ కార్యక్రమం నుంచి ఈ ప్రపంచంలోకి జెస్సీ అడుగు పెట్టారు.అంటూ అతనిని పరిచయం చేయగా జెస్సీఈ ప్రపంచంలోకి అడుగు పెట్టగానే మొట్టమొదట చూసిన అమ్మాయి ఆరీయానా అని తనకు లవ్ ప్రపోజ్ చేశారు.ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత చూసిన మొదటి అమ్మాయి తనే కావడంతో తన ప్రేమలో పడిపోయాను అని జెస్సీ ఈ సందర్భంగా మాట్లాడటంతో అరియాన సంబరపడింది.

Jessie Says I Love You To Ariyana In Bigg Boss Buzz Show Details, Bigg Boss 5,

అయితే ఊహించని విధంగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి కాజల్ కాకుండా జెస్సీ బయటకు వచ్చారు.అయితే జెస్సి అనారోగ్యం కారణంగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే కాజల్ సేఫ్ జోన్ లోకి వెళ్లి బిగ్ బాస్ హౌస్ నుంచి జెస్సీ బయటకు వచ్చారు.

ఇలా బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో పాల్గొన్న జెస్సీ అరియానతో కలిసి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.ఏదిఏమైనా ఈ వారం ఎవరూ ఊహించని విధంగా తను బయటకు రావడంతో కాజల్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ తమ అభిమాన కంటెస్టెంట్ ఎలిమినేషన్ నుంచి తప్పించినందుకు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా అరియాన అడిగే ఎన్నో ప్రశ్నలకు జెస్సీ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.ఇక టాప్ ఫైవ్ లో భాగంగా సిరి, షణ్ముఖ్, శ్రీరామ్, సన్నీ, రవి ఉంటారని జెస్సీ తెలియజేశారు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు