ఉప్పల్ లో జీత్ క్రికెట్ అకాడమి ని తెలంగాణ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

ఒక క్రీడాకారుడు మాత్రమే మంచి విద్యార్థిగా,మంచి నాయకునిగా రాణించ గలడని తెలంగాణ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

ఉప్పల్ లో జీత్ క్రికెట్ అకాడమిని స్థానిక ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి,తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ తో కలిసి ఆయన బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి పెంచే విదంగా ఈ అకాడమీ ని ప్రారంభించిన వాలీబాల్ క్రీడాకారుడు నర్సింహ రెడ్డి ని అభినందించారు.ఇంకా ఈ పరిసరప్రాంతాలలో ప్రభుత్వ స్థలం ఉంటే వాటిలో వాలీబాల్,బాస్కెట్ బాల్ ,స్విమ్మింగ్ పూల్ లాంటివి నేలకొల్పాలని సూచించారు.

దీనికి కావాల్సిన అనుమతులను సమకూరుస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక టి ఆర్ ఎస్ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు