ఆ ప్రముఖ నటిని నాగేశ్వరరావు చెడ్డ నటి అని అన్నారట.. ఏమైందంటే?

టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు తన సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

క్లాస్, కుటుంబ ప్రేక్షకులకు నచ్చే సినిమాలలో ఏఎన్నార్ ఎక్కువగా నటించగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడంతో పాటు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయనే సంగతి తెలిసిందే.

ఏఎన్నార్ తన సినీ కెరీర్ లో వివాదాలకు దూరంగా ఉన్నారు.ప్రముఖ నటి జయమాలిని తాజాగా ఏఎన్నార్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ నన్ను మంచిగా ట్రీట్ చేసేవాళ్లని ఆమె తెలిపారు.దానవీర శూరకర్ణ సినిమా సమయంలో సీనియర్ ఎన్టీఆర్ అంటే కొంచెం భయం వేసిందని ఆమె చెప్పుకొచ్చారు.

కృష్ణుడు అంటే సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే గుర్తుకొస్తారని ఆయన మినహా మరెవరూ గుర్తుకు రారని జయమాలిని కామెంట్లు చేశారు.సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేను చాలా విషయాలను నేర్చుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

Advertisement

చిన్న అమ్మాయి వస్తే కూడా గౌరవం ఇచ్చి కూర్చోండి అని ఎన్టీఆర్ చెప్పేవారని అమె వెల్లడించారు.ఏఎన్నార్ గారికి కొంచెం అల్లరితనం ఎక్కువని ఏయ్ పిల్లా.అట్లా ఉంది ఇట్లా ఉంది అని ఆయన అనేవారని జయమాలిని చెప్పుకొచ్చారు.

ఒక సందర్భంలో ఏఎన్నార్ నన్ను చెడ్డ అమ్మాయి అని అన్నారని ఆమె తెలిపారు.

నా భార్య నువ్వు చేసే సాంగ్స్, పాత్రల వల్ల చెడ్డ అమ్మాయి అంటుంది అని ఆయన చెప్పేవారని ఆమె చెప్పుకొచ్చారు.అభిమానులు రోజులు గడుస్తున్నా నన్ను మరిచిపోవడం లేదని విఠలాచార్య గారు నా పేరును అలివేలు మంగ నుంచి జయమాలినిగా మార్చారని ఆమె పేర్కొన్నారు.మొత్తం ఎనిమిది మంది పిల్లలమని తల్లీదండ్రులకు నేను ఆఖరి అమ్మాయినని అయినప్పటికీ కుటుంబ భారం నాపైనే పడిందని ఆమె వెల్లడించారు.

చేతుల‌ను తెల్ల‌గా, మృదువుగా మార్చే వాసెలిన్‌..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు