Jayalalitha Krishna: నా కూతురు పెళ్లికి రావద్దు అని సీఎం జయలలితకు కృష్ణ ఎందుకు చెప్పాడు ?

సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) హీరోగా ఎన్నో వందల సినిమాలో నటించాడు.ఆయనకు లక్షల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేది.

పైగా కృష్ణ అంటే కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు స్టార్ హీరోలు నటీనటులు అంతా కూడా అభిమానించేవారు అందుకే ఆయనకు చాలా గట్టి అభిమాన ఘణం ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక సూపర్ స్టార్ కృష్ణ కి మొదటి భార్య ఇందిరా దేవి( Indira Devi ) ద్వారా ఐదుగురు సంతానం అందులో మొదట అమ్మాయి పద్మావతి కాగా రెండవ సంతానం రమేష్ బాబు ఆ తర్వాత మంజుల, మహేష్, ప్రియదర్శిని జన్మించారు.

స్టార్ హీరోగా కృష్ణ ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే తన మొదటి సంతానమైన పద్మావతి కి గల్లా జయదేవ్ ని( Galla Jayadev ) ఇచ్చి వివాహం చేశాడు కృష్ణ.

Jayalalitha Krishna

ఈమె పెళ్లి చెన్నైలోనే ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అప్పట్లో ఈ పెళ్లి గురించి ఆంధ్ర రాష్ట్రమంతా కూడా మాట్లాడుకున్నారు అంటే అతిశయక్తి కాదు.పద్మావతి, గల్లా జయదేవ్ ల వివాహానికి తమిళనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రముఖులు, వ్యాపార మరియు రాజకీయ నాయకులు అంతా కూడా విచ్చేశారు.1991 జూన్ లో జరిగిన ఈ వివాహానికి తమిళనాడు సీఎం మరియు మాజీ హీరోయిన్ అయినా జయలలిత( Jayalalitha ) కూడా ఆహ్వానం పంపాడు కృష్ణ.ఆమె కూడా ఈ వివాహానికి రావడానికి నిర్ణయించుకుంది.

Advertisement
Jayalalitha Krishna-Jayalalitha Krishna: నా కూతురు పెళ్

ఇక జయలలితకు అప్పటికే ఒకసారి అసెంబ్లీలో జరిగిన సంఘటన వల్ల విపరీతమైన సెక్యూరిటీ ఉండేది.

Jayalalitha Krishna

పెళ్లి జరుగుతున్న సమయంలో అప్పటికే ఒకసారి సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అంతా చెక్ చేసి వెళ్లారు పైగా ముందు 2 వరసలు మొత్తం ఖాళీ చేయాలని ఎక్కువ మంది ఆమెతో పాటు వస్తున్నారని, బయట వారిని పెళ్లి నుంచి బయటకు పంపించాలని చెప్పడంతో కృష్ణ ఒక్కసారిగా షాక్ గురయ్యారు పెళ్లికి ఎంతో మంది ముఖ్యులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, మంత్రులు కూడా వచ్చారు.ఈ సమయంలో వారిని అక్కడి నుంచి పంపించి వేయడం కుదరదు కావాలంటే జయలలితనే పెళ్లికి రావద్దు అని చెప్పండి అంటూ వారికి సమాధానం చెప్పారట.దాంతో జయలలిత కూడా విషయాన్ని అర్థం చేసుకుని వారికి కానుకగా పంపించారట.

Advertisement

తాజా వార్తలు