తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఫ్యామిలీలలో బెల్లంకొండ ఫ్యామిలీ ఒకటి గత కొన్ని దశాబ్దాలుగా నిర్మాణరంగంలో దూసుకుపోతున్నటువంటి బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి బెల్లంకొండ సాయి శ్రీనివాస్( Sai Srinivas ) హీరోగా ప్రేక్షకుల ముందుకు ఎంట్రీ ఇచ్చారు.అల్లుడు శీను( Alludu Sreenu ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సాయి శ్రీనివాస్ మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత సినిమాలలో నటిస్తున్న పెద్దగా సినిమాలు మాత్రం సక్సెస్ కాలేకపోయాయి.

ఇలా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన సినిమాల పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఈయన ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు.దాదాపు దశాబ్ద కాలం నుంచి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోయినా ఈయన సినిమాలను ఆదరించే వారి సంఖ్య ఎక్కువగానే ఉందని చెప్పాలి.
ఈయన చేసే సినిమాలన్నీ కూడా హిందీ యూట్యూబ్ ఛానల్ లో డబ్బు అయ్యి విడుదలవుతూ ఉంటాయి.దీంతో ఈయన సినిమాలకు హిందీలో మంచి ఆదరణ లభిస్తుంది అంతేకాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈయనకు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇకపోతే తాజాగా ఈయన బోయపాటి శ్రీను ( Boyapati Sreenu ) దర్శకత్వంలో నటించిన జయ జానకి నాయక(Jaya janaki Nayaka) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో పర్వాలేదు అనిపించుకుంది .ఇలా థియేటర్లో ప్లాప్ టాక్ సొంతం చేసుకున్నటువంటి ఈ సినిమాని హిందీలో డబ్ చేసి యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేశారు.అయితే ఇప్పటివరకు ఏ సినిమాకు రాని విధంగా ఈ సినిమాకు వ్యూస్ రావడంతో ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది.హిందీలో ఏకంగా ఈ సినిమా 800 మిలియన్ వ్యూస్ కైవసం చేసుకున్నట్టు హిందీ రైట్స్ కొనుక్కున్న పెన్ మూవీస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
ఇలా ఒక ఫ్లాప్ సినిమాతో వరల్డ్ రికార్డు సాధించడం అంటే మామూలు విషయం కాదని ఈ సినిమాపై అభిమానులు నేటిజన్ లు కామెంట్లు చేస్తున్నారు.