Faria Abdullah Jathiratnalu : బాబోయ్.. జాతిరత్నాల హీరోయిన్ కోరికలు జాబితా చాలా పెద్దగానే ఉంది

జాతి రత్నాలు సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హైదరాబాది ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా బ్యాక్ టు బ్యాక్ చిన్న సినిమాల్లో నటిస్తూ వస్తుంది.

కొన్ని కారణాల వల్ల స్టార్ హీరో లకు జోడి గా ఈమె అవకాశాలు దక్కించుకోలేక పోతుంది.

ఆ విషయం పక్కన బెడితే తాజాగా ఈ అమ్మడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు.

అయినా కూడా ఈ అమ్మడి యొక్క నటనకు మరో సారి మంచి మార్కులే పడ్డాయని చెప్పుకోవాలి.కామెడీ పాత్ర లను చక్కగా పోషిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రవితేజ కు జోడి గా ఒక సినిమా లో నటిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

Jathiratnalu Heroine Faria Abdullah Interesting Comments About Rajamouli , Jathi

ఆ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని కూడా ఫరియా అబ్దుల్లా పేర్కొంది.ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో ఈ ముద్దుగుమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.హీరోయిన్ గా అవకాశాలు రాని సమయం లో తాను దర్శకత్వం చేస్తానంటూ వ్యాకలను చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Jathiratnalu Heroine Faria Abdullah Interesting Comments About Rajamouli , Jathi

తాజాగా మరో ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ నాకు టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో ఒక సినిమా చేయాలని ఉంది.ఆయన దర్శకత్వం వహించే సినిమా లో చిన్న పాత్ర లో నటించే అవకాశం వచ్చినా మిస్ చేసుకోకుండా నటిస్తాను అంటూ మెల్లగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కి అప్పీల్ చేసుకుంది.

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రూపొందించబోతున్న సినిమా కు సంబంధించిన స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నాడు.ఆయన ఈ విషయం వింటే ఫరియా అబ్దుల్లా కి ఏమైనా చిన్న పాత్ర ఇచ్చే అవకాశం ఉందేమో చూడాలి.

తెలుగు తో పాటు ఇతర భాషల నుండి కూడా ఫరియా అబ్దుల్లా కి అవకాశాలు వస్తున్నాయని సమాచారం అందుతుంది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు