ఓరి, నాయనో.. వెయ్యి ఇళ్లల్లోకి చొరబడ్డ వ్యక్తి.. విచారణలో ఏం చెప్పాడంటే..?

ఈ రోజుల్లో జనాలు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ప్రజలకు హడలెత్తిస్తున్నారు.

సాధారణంగా తెలియని వ్యక్తుల ఇళ్లలోకి వారి అనుమతి లేకుండా వెళితేనే దొంగ అనే ముద్ర వేస్తారు.

పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి కటకటాల వెనక్కి నెడతారు.అయితే ఒక వ్యక్తి ఇది నేరం అని తెలిసినా పట్టించుకోలేదు.

జపాన్( Japan ) దేశానికి చెందిన ఈయన అక్కడ ఏకంగా 1000 మంది ఇళ్లల్లోకి చొరబడ్డాడు.వివరాల్లోకి వెళితే, ఫుకుయోకా ప్రిఫెక్చర్‌లోని దజైఫు నగరంలో( Dazaifu ) ఒక 37 ఏళ్ల జపాన్‌ వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.

ఈయన ఒత్తిడిని తగ్గించుకోవడానికే( Stress Relief ) 1000కు పైగా ఇళ్లల్లోకి అక్రమంగా ప్రవేశించాడట.ఒక సెల్ఫ్ ఎంప్లాయ్డ్‌ వ్యక్తి ఇంటిలోకి ప్రవేశించినప్పుడు అతన్ని పట్టుకున్నారు.

Advertisement

ఆ ఇంటి దంపతులు తమ ఆవరణలో చొరబాటుదారుడు ఉన్నట్లు గమనించి వెంటనే భద్రతా సిబ్బందిని పిలిచారు.పోలీసుల ప్రశ్నించగా, ఆ వ్యక్తి, "ఇతరుల ఇళ్లలోకి చొరబాటు చేయడం నాకు హాబీ.నేను ఇలా 1000కు పైగా సార్లు చేశాను" అని అంగీకరించాడు.

"ఎవరైనా నన్ను పట్టుకుంటారేమో అని నేను చాలా ఉత్సాహంగానూ, ఒత్తిడిగానూ ఉంటాను.నా చేతుల్లో చెమటలు పట్టడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది.

ఇది నా ఒత్తిడిని తగ్గిస్తుంది" అని వివరించాడు.ఆశ్చర్యకరంగా, ఆ వ్యక్తి చొరబాటు చేసిన ఇళ్ల నుంచి ఏమీ దొంగతనం చేయలేదని పోలీసులు ధృవీకరించారు.

ఈ విచిత్రమైన వ్యక్తి పేరు యుటా సుగవార. ఆ సిటీలోనే అతను ఒక ఆఫీసులో పనిచేస్తున్నాడు.అయితే అక్కడి పోలీసులు ఈ వ్యక్తి నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
అధ్యక్షుడిగా ట్రంప్ .. ఈసారి భారతీయ వలసదారులకు కష్టమే : రాజా కృష్ణమూర్తి

అతను ఇప్పటిదాకా ఎన్ని ఇళ్లల్లోకి ఇలా దొంగతనంగా ప్రవేశించాడు? ఎవరికైనా ఏదైనా హాని కలిగించాడా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు.అలాగే అందరి కళ్లుగప్పి ఇతను ఎలా ఇళ్లలోకి వెళ్తున్నాడో అడిగి తెలుసుకుంటున్నారు.

Advertisement

తద్వారా భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని చూస్తున్నారు.

తాజా వార్తలు