క్షమించండి ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నా

ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశం జపాన్‌.

ఎన్నో అద్బుతాలకు నెలవైన జపాన్‌ కు సుదీర్ఘ కాలం ప్రధానిగా పని చేసిన షింజో అబె నేడు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించాడు.

గత కొన్నాళ్లుగా పేగు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న షింజో ఇకపై తన పదవికి న్యాయం చేయలేను అనే ఉద్దేశ్యంతో రాజీనామాకు సిద్దం అయినట్లుగా పేర్కొన్నాడు.దేశంలో చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి.

Japan Pm Resign Over Health Problems, Japan, PM Shinzo Abe, Resign, Libaral Demo

ఈ సమయంలో పదవికి రాజీనామా చేస్తున్నందుకు ప్రజలంతా కూడా క్షమించాలంటూ తలవంచి ఆయన క్షమాపణ చెప్పాడు.షింజో పదవి కాలం మరో ఏడాదికి పైగా ఉంది.

ఆయన మళ్లీ అధికారంలోకి వస్తాడనే అంతా అనుకున్నారు.ఇలాంటి సమయంలో ఆయన అనారోగ్యం కారణం చెప్పి పదవికి రాజీనామా చేయడంతో అక్కడ రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది.

Advertisement

ప్రపంచ దేశాల్లో జపాన్‌ చాలా కీలకమైన దేశం కనుక ఆ దేశ తదుపరి ప్రధాని ఎవరై ఉంటారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.షింజో రాజీనామాతో అధికార పార్టీ అయిన లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.

కొత్త ప్రధాని ఎంపిక విషయంమై చర్చించడం జరిగింది.కొత్త ప్రధాని వచ్చే వరకు షింజోనే ప్రధానిగా కొనసాగుతారు అంటూ పార్టీ సమావేశంలో నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు