Janhvi kapoor vijay sethupathi : జాన్వీ కపూర్ కు అవకాశాలు తగ్గిపోయాయా.. ఆ హీరోకు ఫోన్ చేసి ఛాన్స్ ఇవ్వమని అడుగుతూ?

దివంగత నటి, హీరోయిన్ శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ గురించి మనందరికీ తెలిసిందే.

శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

ధడక్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది.ఇకపోతే ప్రస్తుతం జాన్వీ కపూర్ బాలీవుడ్ లో సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసేందే.

అయితే జాన్వీ కపూర్ ఎప్పుడెప్పుడు సౌత్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఇప్పటికే జాన్వీ పలు సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్ విజయ్ సేతుపతి లాంటి వారితో నటించాలని ఉంది అంటూ తన మనసులోని మాటను బయటపెట్టిన విషయం తెలిసింది.

ఈ నేపథ్యంలోని తాజాగా ఇంటర్వ్యూలో మరొక విషయాన్నీ వెల్లడించింది జాన్వీకపూర్.ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.

Advertisement

విజయ్‌ సేతుపతి సర్‌ అంటే నాకెంతో ఇష్టం.ఆయన నటించిన నానుమ్‌ రౌడీ వందసార్లు చూశాను.

తర్వాత ఒకసారి ఆయనకు ఫోన్‌ చేసి సార్‌, మీకు పెద్ద అభిమానిని.మీతో కలిసి నటించాలని ఉంది.

ఛాన్స్‌ ఇస్తే ఆడిషన్‌కు వస్తాను అని చెప్పాను.ఆయన మాత్రం అయ్యో అయ్యో అంటూ సరదాగా నవ్వారే తప్ప సమాధానం ఇవ్వలేదు.

ఆయన సిగ్గుపడుతున్నారో, ఇబ్బందిగా ఫీలయ్యారో అర్థం కాలేదు.కాకపోతే ఆయన ఆశ్చర్యపోయారని మాత్రం అర్థమైంది అని చెప్పుకొచ్చింది జాన్వీ.ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

అయితే ఈ వార్తపై స్పందించిన పలువురు నెటిజన్స్ జాన్వీ కపూర్ కు హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోయాయి అందుకే హీరోకి అలా ఫోన్ చేసి అవకాశం ఇవ్వమని అడిగిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement