దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తె అయిన జాన్వీ కపూర్( Sridevi Daughter Janhvi Kapoor ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
మొదట దడక్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా తెచ్చుకున్న విషయం తెలిసిందే.
శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.కాగా జాన్వీ కపూర్ నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది జాన్వీ కపూర్.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం జాన్వీ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా( Devara Movie )లో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.కాగా ఈ భామకు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చినట్లు అనిపిస్తుంది.ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల అభిరుచులు పూర్తిగా మారిపోయాయి.
ఓటీటీ కల్చర్ పెరిగిపోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తిని చూపించడం లేదు.తెలుగులో స్టార్ హీరోల సినిమాలు కచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ అవుతున్నాయి.
బాలీవుడ్ లో మాత్రం పరిస్థితి అలా లేదు.చాలామంది ప్రముఖ హీరోలు, హీరోయిన్ల సినిమాలు ప్రముఖ ఓటీటీల్లో నేరుగా విడుదలవుతున్నాయి.
మిగతా వాళ్ల సంగతేమో గానీ జాన్వీ కపూర్ ని మాత్రం ఓటీటీ స్టార్ అని అంటున్నారు.
ఎందుకంటే ఇప్పటివరకు ఆరు సినిమాలు చేస్తే అందులో మూడు ఓటీటీలోనే విడుదల అయ్యాయి.జాన్వీ నటించిన వాటిలో ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ విడుదల కాగా, గుడ్ లక్ జెర్రీ హాట్ స్టార్ లో వచ్చింది.ఇప్పుడు వరుణ్ ధావన్ తో కలిసి నటించిన బవాల్ సినిమా( Bawaal Movie Release ) జూలైలో నేరుగా అమెజాన్ ప్రైమ్ లోకి విడుదల కానున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ తో దేవర అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న జాన్వీకి ఇలా డైరెక్ట్ ఓటీటీ రిలీజులు కొత్త కష్టాలు తీసుకొస్తున్నాయని చెప్పొచ్చు.ఒకవేళ ఇది ఇలానే కొనసాగితే మాత‍్రం భవిష్యత్తులో ఈమెకి మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతాయోమో? కాగా విషయంలో అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతోంది జాన్వీ.ఆమెను తల్లి శ్రీదేవి మాదిరిగా స్టార్ హీరోయిన్ గా చూడాలి అనుకుంటుండగా జాన్వీ మాత్రం ఓటీటీ కి పరిమితం అయ్యేలా కనిపిస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy