ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పరిస్థితి వారాహి యాత్ర( Varahi yatra ) కు ముందు ఆ తర్వాత అన్నట్టుగా మారింది .
వారాహి యాత్రకు ముందు కూడా యువత మద్దతు ఆ పార్టీకి భారీగానే ఉన్నప్పటికీ వారాహి యాత్ర తర్వాత తటస్తులు మరియు మహిళలు జనసేన వైపు రావడం కనిపిస్తుంది.
అయితే శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్టుగా బలమైన కీలక నేతలు రాకుండా పార్టీ బలంగా ఉందని చెప్పడం సాధ్యపడదు.ఇప్పుడు జనసేనకు ఆ లోటు కూడా తీరిపోయినట్లుగా కనిపిస్తుంది.
గత కొన్ని రోజులుగా వరుస పెట్టి కీలక నేతలు జనసేన వైపు క్యూ కడుతున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే ఆమంచి స్వాములు( Amanchi Swamulu ), పంచకర్ల రమేష్ బాబు, టీ టైం అధినేత ఉదయ్ శ్రీనివాస్ పార్టీలో జాయిన్ అవ్వగా ఆ లిస్టు పెరుగుతూ పోతున్నట్లుగా తెలుస్తుంది.
కొణతాల రామకృష్ణ, డిఎల్ రవీంద్రారెడ్డి మల్లిపూడి పల్లంరాజు , రఘురామ కృష్ణం రాజు ఇలా జిల్లా స్థాయిలో చక్రం తిప్పగల కీలక నేతలు చూపు ఇప్పుడు జనసేన వైపు ఉన్నట్లుగా తెలుగు మీడియా లో వార్తలు వస్తున్నాయి.
ఒకవైపు కీలక నేతల చేరిక మరోవైపు కేంద్ర అధికార పార్టీ అండ తో వచ్చే ఎన్నికల్లో జనసేన పూర్తి స్థాయిలో తన సత్తా చూపిస్తుందని తెలుస్తుంది.గత కొన్ని నెలలుగా ఈ నేతలు జనసేనానికి టచ్ లోనే ఉన్నప్పటికీ అధికార పార్టీ వీరిని ఆర్థికంగా ఇబ్బంది పడుతుందేమో అన్న ఉద్దేశంతోనే వీరి ఎంట్రీని రహస్యంగా ఉంచారని వీరి దారిలోనే ఉభయగోదావరి జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మరింత మంది కీలక నేతలు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని వారితో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంప్రదింపులు చేస్తున్నారని ఇది శాంపిల్ మాత్రమే అని జనసైనికులు వాఖ్యనిస్తున్నారు .
ప్రజారాజ్యం అనుభవాలతో పవన్ కళ్యాణ్( Pawan klayan ) రాటు తేలారని, జనసేన పార్టీని ప్రభావంతమైన ప్రత్యామ్నాయ పార్టీగా రాష్ట్ర రాజకీయాల్లో నిలబెట్టడానికి తన వ్యూహాలకు పదును పెడుతూ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని, బలమైన రెండు పార్టీల వ్యూహ ప్రతి వ్యూహాలను ఎప్పటికప్పుడు పసిగడుతూ వాటిని చిత్తు చేసే విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు అని వార్తలు వస్తున్నాయి.రానున్న రోజుల్లో మరింత కీలక నేతలను పార్టీలోకి తీసుకువచ్చి జనసేన పొలిటికల్ ఇమేజ్ ను పురతు స్థాయిలో పవన్ మార్చబోతున్నారని వచ్చే ఎన్నికలకు అన్నివిదాలుగా సన్నదం అయ్యేలా పార్టీని ప్రిపేర్ చేస్తున్నారు అంటున్నారు .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy