Pawan Kalyan Nadendla Manohar : టీడీపీ పేరు ఎత్తకుండా విమర్శలు చేస్తున్న జనసేన ?

ఏపీలో జనసేన రాజకీయం ఎవరికి అర్థం కావడం లేదు.

ఆ పార్టీ 2024 ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తారు అనే విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు.

ప్రస్తుతం బిజెపితో ఆ పార్టీ పొత్తు కొనసాగిస్తున్న,  ఎన్నికల సమయం నాటికి టిడిపి తో పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం చాలా కాలం నుంచి జరుగుతోంది.కానీ ఇటీవల విశాఖలో ప్రధాని నరేంద్ర మోది తో పవన్ కళ్యాణ్ భేటీ అయినప్పుడు టిడిపి తో కలిసి వెళ్లడం వల్ల నష్టమే జరుగుతుందని , బిజెపితోనే ఉండాలంటూ ప్రధాని పవన్ కు సూచించారని ప్రచారం తెరపైకి వచ్చింది .దీనికి తగ్గట్లుగానే పవన్ సైతం అప్పటి నుంచి టిడిపి వ్యవహారాలకు దూరంగానే ఉంటూ జనసేన ఒంటరిగా బలోపేతం చేసే విషయంపై దృష్టి సారించారు.ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ 2024 ఎన్నికల్లో జనసేన అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించడంతో , టీడీపీతో ఆ పార్టీ కలిసి వెళ్లదు అనే విషయం అందరికీ అర్థమైంది.

అయినా జనసేన తమతో కలిసి వస్తుందని ఆశల్లో టిడిపి ఉండగా,  తాజాగా మరోసారి ఈ వ్యవహారంపై నాదెండ్ల మనోహర్ స్పందించారు పరోక్షంగా టిడిపి పై సెటైర్లు వేశారు.జనసేన పారదర్శక రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తోందని,  ఏ పార్టీతోనైనా పొత్తు ఉంటే ధైర్యంగా చెప్పే దమ్ము పవన్ కళ్యాణ్ కు ఉందంటూ మనోహర్ క్లారిటీ ఇచ్చారు.

కొన్ని పార్టీలు కావాలని విష ప్రచారం చేస్తున్నాయని , రాష్ట్రంలో తమ పార్టీ బలంగా ఎదుగుతుందని మనోహర్ వివరించారు.

Advertisement

తమ  పార్టీ బలపడుతుందనే రెండు పార్టీలకు భయం పట్టుకుందని పరోక్షంగా టిడిపిలో పై మనోహర్ కామెంట్ చేశారు.మనోహర్ టిడిపిని ఉద్దేశించి ఈ రకమైన కామెంట్స్ చేయడంతో,  ఏపీలో ఇక టీడీపీ, జనసేన పొత్తు ఉండదని , బిజెపితోనే జనసేన కలిసి వెళ్ళబోతుందనే విషయం పై స్పష్టత వచ్చింది.ఇప్పటి వరకు టిడిపి పై విమర్శలు చేయకుండా, కేవలం వైసీపీ నే టార్గెట్ చేసుకుంటూ వచ్చిన జనసేన ఇప్పుడు పరోక్షంగా టిడిపి అంశాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తూ ఉండడంతో,  ఎన్నికల్లో టిడిపి కూడా జనసేన ప్రత్యర్థి అనే విషయం అందరికీ క్లారిటీ వస్తోంది.

సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు
Advertisement