విశాఖలో జనసేన ఆందోళన.. నెలకొన్న ఉద్రిక్తత

విశాఖపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.టైకూన్ జంక్షన్ మూసివేతను నిరసిస్తూ జనసేన ఆందోళనకు పిలుపునిచ్చింది.

ఈ క్రమంలోనే మహాధర్నాకు సిద్ధమైంది.దీంతో టైకూన్ జంక్షన్ వద్దకు నేతలతో పాటు జనసైనికులు భారీగా తరలి వస్తున్నారు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు జనసేన పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.అరెస్టుల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు, పోలీసులకు మధ్య చెలరేగిన వివాదంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

మరోవైపు నోవాటెల్ హోటల్ దగ్గర జనసేన నేత నాదెండ్ల మనోహార్ ను పోలీసులు అడ్డుకున్నారు.దీంతో పోలీసుల తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Advertisement

శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని పేర్కొన్నారు.ప్రజల ఇబ్బందులపై మాట్లాడుతుంటే అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేదని మండిపడ్డారు.

ఆ హీరో రూపాయి కూడా తీసుకోలేదు.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి : దిల్ రాజు
Advertisement

తాజా వార్తలు