అడ్వాన్స్‌లు అందాయా... ముంద‌స్తు ఎన్నిక‌లు నిజ‌మే

Jamili Elections Conducted In Ap And Telangana Shortly

ముందస్తు ఎన్నికల సమాచారం కాస్త ముందస్తుగానే లీకయిపోయినట్టు ఉంది.అందుకే పార్టీల్లో ఎక్కడ లేని హడావుడి కనిపిస్తోంది.

 Jamili Elections Conducted In Ap And Telangana Shortly-TeluguStop.com

చాలాకాలంగా ఈ వార్తలు వినిపిస్తున్నా .పెద్దగా ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు.చాలా కాలంగా జమిలి ఎన్నికలు అంటూ ప్రచారం సాగుతున్నా .ఇప్పుడు ఆ వార్తలు నిజమనే సంకేతాలు బలంగా కన్పిస్తున్నాయి.ముందస్తు ఎన్నికల హడావుడి ముందుగా తెలంగాణాలోని సిరిసిల్ల జిల్లాలో కనిపిస్తోంది.ఆ సంకేతాలే ఇప్పుడు ముందస్తు ఎన్నికలు తీసుకొస్తున్నాయని తెలంగాణ అధినేత కేసీఆర్ కూడా నమ్ముతున్నాడు.జమిలి ఎన్నికలకు తెలంగాణకు ఏంటి సంబంధం అనే ప్రశ్నకు సమాధానం కూడా ఉంది.

విషయం ఏంటంటే… దక్షిణాదిలో ఏ పార్టీ ఎన్నికలకు సిద్ధమైనా ఆ పార్టీకి సంబంధించిన జెండాలు – కండువాలు – ప్రచార సామగ్రిని కరీంనగర్ పూర్వపు జిల్లాలోని సిరిసిల్లలో తయారు చేస్తారు.ఇక్కడ నేత పరిశ్రమ విస్తరించడంతో అన్ని పార్టీలు ఇక్కడే ప్రచార సామగ్రి తయారు చేయిస్తుంటాయి.ఎన్నికలు వస్తున్నాయంటే చాలు సిరిసిల్ల నేతన్నలు బిజీ అయిపోతారు.

తాజాగా మరోసారి సిరిసిల్ల నేతన్నలకు పెద్ద ఎత్తున పార్టీల ప్రచార సామగ్రి తయారీ కాంట్రాక్టులు వచ్చాయి.చత్తీస్ ఘడ్ – మహారాష్ట్ర – మధ్యప్రదేశ్ నుంచి నాయకులు వచ్చి కాంట్రాక్టు ఇచ్చారు.

ఇప్పుడు వారంతా ఆ తయారీలో నిమగ్నమయ్యారు.మొదట బీజేపీ నేతలు ఈ కాంట్రాక్ట్ ఇవ్వగా తాజాగా కాంగ్రెస్ నాయకులు కూడా ఇచ్చారట.

వచ్చే అక్టోబర్ లో దేశవ్యాప్తంగా జమిలి లేదా సార్వత్రిక ఎన్నికలకు కేంద్రం సిద్ధమవుతోంది.ఇందుకోసం ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలకు సూచనలు అందినట్టు సమాచారం.

దీనికి తగ్గట్టుగానే అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి.తెర వెనుక విషయం కూడా ఇక్కడే లీక్ అయిపోయింది.

అందుకే ఇప్పుడే ముందస్తుగా సర్దుకుంటున్నారు.మొన్నీ మధ్య సీఎం కేసీఆర్ మోడీతో అంతరంగికంగా జరిపిన చర్చల్లో అసలు విషయం ఇదేనట.

ఇక ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో తాజా పొలిటిక‌ల్ వాతావ‌ర‌ణం చూస్తుంటే జ‌మిలీ ఎన్నిక‌ల‌కు అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి.కేసీఆర్ ఈ విష‌యంలో అంద‌రికంటే కాస్త ముందే ఉన్నారు.

ఆయ‌న కేంద్రం ఎప్పుడు లోక్‌స‌భ ర‌ద్దు చేస్తే ఆ వెంట‌నే ఆయ‌న కూడా అసెంబ్లీ ర‌ద్దు చేసి కేంద్రంతో పాటే ఎన్నిక‌ల‌కు వెళ్లిపోనున్నారు.ఇక ఏపీలో చంద్ర‌బాబు ప‌రిస్థితే కాస్త డోల‌యామానంలో ప‌డింది.

ఆయ‌న జ‌మిలీ ఎన్నిక‌ల‌కు వెళ‌తాడా ? లేదా చేయాల్సిన ప‌నులు కొన్నైనా కంప్లీట్ చేసి మార్చిలోనే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ‌తాడా ? అన్న‌ది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube