పార్టీ సభ్యత్వం తీసుకుంటే డబుల్ బెడ్ రూం ఇల్లు..ఎక్కడంటే..

జైమహాభారత్ పార్టీలో సభ్యత్వం తీసుకుంటే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని ప్రకటన చేసి న్యూసెన్స్ క్రియేట్ చేసిన జై మహాభారత్ పార్టీ నిర్వాహకులపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ అయ్యారు.జై మహాభారత్ పార్టీ అధ్యక్షుడు అనంత విష్ణు దేవా ప్రభుపై కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.

 Jai Mahabharat Party Announces Double Bedroom Houses For Those Who Take Party Ca-TeluguStop.com

వ్యక్తుల ఫోటోస్ మరియు ఆధార్ కార్డులలు తీసుకోవడంపై ఆతనిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు న్యాయ సలహా తీసుకుంటున్నారు.ఇప్పటికే ఎలక్షన్ కమిషన్‌కు పోలీసులు సమాచారం ఇచ్చారు.

ఇప్పటివరకు ఎవరూ తమ దృష్టికి తీసుకురానందున చర్యలు తీసుకోలేకపోతుననామని అధికారులు చెబుతున్నారు.

జైమహాభారత్ పార్టీలో సభ్యత్వం తీసుకుంటే డబుల్ బెమ్ రూమ్ ఇల్లు లేదా 200 గజాల స్థలం ఇస్తామన్న ఆఫర్ తో మహిళలు క్యూ కట్టారు.

హైదరాబాద్ రవీంద్రభారతి పక్కనే రెడ్ హిల్స్ కాలనీలో ఉన్న జై మహాభారత్ పార్టీ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు.రెండు పాస్ పోర్టు ఫొటోలు, ఆధార్ జిరాక్స్ కాపీతో వచ్చిన మహిళలు.జై మహాభారత్ సభ్యత్వం కావాలంటూ బారులు తీరారు.కాగా… దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది.న్యూసెన్స్ అవుతోందని సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో రెడ్ హిల్స్ కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.

Telugu Ananthavishnu, Doublebedroom, Hyderabad, Jai Mahabharat, Candidature-Poli

జైమహాభారత్ పార్టీ ప్రకటనతో ఒక్కసారిగా సభ్యత్వం కోసం పార్టీ కార్యాలయానికి ప్రజలు పోటెత్తారు.గడిచిన మూడు నెలల కాలంలోనే 5లక్షల వరకు పార్టీ మెంబర్ షిప్ నమోదైనట్లు సమాచారం తెలుస్తోంది.డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వస్తుందనే ఆశతో మహిళలు భారీగా తరలివస్తున్నారు.

గంటల కొద్దీ క్యూలెన్లలో నిలుచుని పడిగాపులు పడుతున్నారు.ఇంకా ఆశ్చర్యమేంటంటే… నగరంలోని మహిళలే కాదు.

హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో మహిళలు రవీంద్రభారతి పక్కనున్న జై మహాభారత్ పార్టీ కార్యాలయానికి తరలివస్తున్నారు.ఒక్కసారిగా వందల మంది తరలిరావడంతో స్థానికంగా గందరగోళ పరిస్థితులు నెలకోవడంతో… ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పాడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube