నాని జై బాలయ్య కి రెడీ అయినట్లేనా

యువ హీరో నాని ఇటీవల ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రంతో ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే.

ఆ సినిమా తర్వాత నాని నటిస్తున్న సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

‘అందాల రాక్షసి’ ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాని తాజా చిత్రం టైటిల్‌ ఫిక్స్‌ అయ్యింది.ఈ చిత్రంలో నాని నందమూరి బాలకృష్ణకు వీరాభిమానిగా కనిపించబోతున్నాడు.

దాంతో ఈ చిత్రానికి మొదటి నుండి కూడా ‘జై బాలయ్య’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.అయితే ఆ వార్తలను నాని రెండు సార్లు కొట్టి పారేశాడు.

చిత్ర యూనిట్‌ సభ్యులు సైతం టైటిల్‌ ఇంకా నిర్ణయించలేదు అని, త్వరలోనే టైటిల్‌పై ప్రకటన చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు.తాజాగా ఈ చిత్రానికి ‘జై బాలయ్య’ టైటిల్‌నే ఫిక్స్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

Advertisement

ఈ టైటిల్‌తోనే ఈ చిత్రానికి మంచి పబ్లిసిటీ వస్తుందని, జై బాలయ్య అని ఉంటే వేరే హీరోల ఫ్యాన్స్‌ వస్తారో రారో అనే అనుమానంతో మొన్నటి వరకు టైటిల్‌పై నిర్ణయం తీసుకోలేక పోయారు.అయితే సినిమా బాగుంటే ఏ టైటిల్‌ పెట్టిన ప్రేక్షకులు పరుగెత్తుకుని థియేటర్‌కు వస్తారు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు ముగింపు దశకు చేరుకుంది.వచ్చే నెల 10 ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించి, ఫిబ్రవరి మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలని 14 రీల్స్‌ సంస్థ నిర్ణయించుకుంది.

Advertisement

తాజా వార్తలు