మరో ఏడాదిలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి.
దీంతో ఇప్పటి నుంచే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఆ ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
ఇప్పటికే టిడిపి మహానాడులో ఆ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది.ఎన్నో ఉచిత పథకాలను టిడిపి ప్రకటించింది .ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం( YCP ) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు దీటుగా తాము సరికొత్త పథకాలను అందిస్తామని, పూర్తిగా ప్రజలకు మేలు జరిగే విధంగా తాము పరిపాలన చేస్తామంటూ చంద్రబాబు ప్రకటించారు.ఇక అధికార పార్టీ వైసిపి రాబోయే ఎన్నికల్లో గెలుపు పై చాలా ధీమాగానే ఉంది.
ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను మళ్ళీ గట్టెక్కిస్తాయని ఆశలు పెట్టుకుని, తమ పాలనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో లబ్ధి చేకుర్చాము కాబట్టి ఆ కృతజ్ఞతతో మళ్ళీ తమను అధికారంలోకి తీసుకొస్తారని నమ్మకం పెట్టుకుంది.
టిడిపి, జనసేన, బిజెపిలో కలిసి పోటీ చేసినా, వైసిపి విజయాన్ని ఆపలేరని పదేపదే వైసిపి నాయకులు ప్రకటనలు చేస్తూ, ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇక జగన్ సైతం గెలుపు పక్కా ధీమాతో ఉన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ ఎమ్మెల్యేగా పనితీరును అంచనా వేస్తున్న, జగన్( YS Jagan Mohan Reddy ) ప్రతి నియోజకవర్గం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
ఏ ఏ నియోజకవర్గాల్లో గెలుపు పై అనుమానాలు ఉన్నాయో అక్కడ అభ్యర్థులను మార్చి వారి స్థానంలో ప్రజాబలం ఉన్న వారిని ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.ఈ విషయంలో ఎటువంటి మొహమాటలకు వెళ్లకుండా, నిఘా వర్గాల సమాచారం , సర్వే నివేదికల ఆధారంగానే అభ్యర్థుల ఎంపికను చేపట్టబోతున్నారు .ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించగా , మరికొన్ని నియోజకవర్గాల్లో కొంతమందిని అభ్యర్థులుగా పోటీకి దింపేందుకు చూస్తున్నారు.ప్రస్తుతం వైసీపీ తరఫున గళం విప్పుతూ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్న నాయకులు కొంతమందికి టికెట్ ఇచ్చినా, గెలిచే అవకాశం లేదనే సంకేతాలతో వారు అసంతృప్తికి గురవకుండా, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆ టికెట్ ను ఇచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనే ఆలోచనతో జగన్ ఉన్నారు.
ఇటీవల టెక్కిలి వైసిపి అభ్యర్థిగా ఎమ్మెల్సీ పోటీ చేస్తారని ప్రకటించారు.
టిడిపి ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్న నాయుడు పై ప్రత్యర్థిగా శ్రీనివాస్ అయితేనే బాగుంటుందని భావించారు .అయితే దువ్వాడ శ్రీనివాస్( Srinivas Duvvada ) కు మాస్ ఫాలోయింగ్ ఉన్నా, ఎన్నికల్లో గెలిచే అంత స్థాయిలో ప్రజాభిమానం లేదనే విషయాన్ని గుర్తించిన జగన్ టెక్కిలి అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ భార్యను పోటీకి దించాలని భావిస్తున్నారట.ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా గెలుపు పై అనుమానాలు ఉన్న నియోజకవర్గాల్లో ఇదే ఫార్ములాను ఉపయోగించి ఎవరికీ అసంతృప్తి లేకుండా చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నా, ఇప్పటి నుంచే అన్ని నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి అభ్యర్థులు ఎంపిక పై జగన్ చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy