బాబుకి వారి అపాయింట్మెంట్ దొరికితే ? జగన్ నిర్ణయం ఇదే ? 

వైసీపీ ప్రభుత్వం పై ఫిర్యాదు చేసేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ అపాయింట్మెంట్ దొరికింది.దీంతో ఆయన సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు.

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పై బాబు అనేక ఫిర్యాదులు చేయనున్నారు.రాష్ట్రపతిని కలిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి వారిని కలిసి ఏపీ ప్రభుత్వం పై ఫిర్యాదు చేయడంతో పాటు, బీజేపీకి అన్ని విషయాల్లోనూ ఇకపై తాము సహకరిస్తామనే విధంగా బాబు చర్చించాలనే వ్యూహంతో ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు.

ఇక ఈ విషయంలో తమ తప్పేమీ లేదని, రాజకీయంగా ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు టిడిపి తనపై వ్యక్తిగత దూషణలకు దిగిందనే విషయాన్ని బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు.చంద్రబాబు విషయానికి వస్తే ఆయనకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకడం వరకు ఓకే అయినా, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి వారి అపాయింట్మెంట్ దొరికితే ప్రభుత్వానికి కొత్త ఇబ్బందులు ఏర్పడతాయి.

చంద్రబాబు వారిద్దరిలో ఎవరితో భేటీ అయినా, అక్కడ ఏ విషయాలు చోటు చేసుకున్నా, ఏపీలో మాత్రం ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.టిడిపి విషయంలో బిజెపి సానుకూలంగా వ్యవహరిస్తే టిడిపి రాజకీయ లబ్ధి పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది.

Advertisement

ఇదే విషయాన్ని గ్రహించే చంద్రబాబు ఏదో రకంగా మోదీ, అమిత్ షాల లో ఎవరో ఒకరిని కలవాలని గట్టిగానే అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు.ఒకవేళ బాబుకి అపాయింట్మెంట్ దొరికి, చంద్రబాబుకు వారు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తే, ఏపీలో పరిస్థితి వేరేగా ఉంటుంది.

అదే జరిగితే ఇక బీజేపీని పూర్తిగా పక్కన పెట్టేందుకు సైతం వెనుకడబోమనే సంకేతాలను బీజేపీ అధిష్టానం పెద్దలకు జగన్ కొంతమంది కీలక నాయకుల ద్వారా సంకేతాలు పంపించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా జగన్ మొదటి నుంచి నిలుస్తూ వస్తున్నారు.కీలకమైన బిల్లులు, ఓటింగ్ లలో బిజెపి నిర్ణయానికి అనుగుణంగా వైసీపీ ఎంపీలు వ్యవహరిస్తున్నారు.ఏపీ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా , జగన్ అన్ని విషయాలలోనూ సర్దుకుపోతూ వస్తున్నారు.

అయితే టిడిపి విషయంలో బిజెపి సానుకూలంగా కనుక వ్యవహరిస్తే, ఇక బీజేపీ కి దూరం అవ్వాలనే నిర్ణయానికి జగన్ వచ్చినట్టుగా కనిపిస్తున్నారు.  ప్రస్తుతానికి జగన్ సహకారం బిజెపికి అవసరం లేకపోయినా భవిష్యత్తు లో తప్పనిసరిగా అవసరం అవుతుంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
కొత్త కార్యాలయంలోకి అడుగు పెట్టిన కాంగ్రెస్ పార్టీ

బీజేపీకి బొటాబొటిగా మెజారిటీ వస్తే తప్పనిసరిగా జగన్ పార్టీ ఎంపీల మద్దతు అవసరం అవుతుంది.అందుకే చంద్రబాబు విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారనేది పూర్తిగా బీజేపీకే జగన్ వదిలి పెట్టేశారట.

Advertisement

వారి యాక్షన్ బట్టి రియాక్షన్ చూపించాలనేది జగన్ ఆలోచనగా వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.

తాజా వార్తలు