ఎన్నికల సంవత్సరంలోకి అడుగుపెట్టినందున ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh )రాజకీయాల్లో వేగం పెరిగింది ప్రభుత్వ వైఫల్యాలపై అధికారి పార్టీని పై ముప్పేట దాడి చేస్తున్న ప్రతిపక్షాలు విమర్శల వాగ్బాణాలు సంధిస్తూ పొలిటికల్ హీట్ ని పెంచేస్తున్నాయి .తన భాష పై తరచుగా విమర్శలను ఎదుర్కునే తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh )కూడా తన భాష నైపుణ్యాన్ని వాక్చాతుర్యాన్ని పెంచుకొని తన యువగళం పాదయాత్ర లో అధికార పార్టీ నేతల అవినీతిపై మాస్ డైలాగులు పేలుస్తున్నారు.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అయితే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి నే టార్గెట్ గా చేసుకొని భారీ స్టేట్మెంట్లు ఇస్తున్నారు.ప్రభుత్వ వ్యతిరేకతను చీల్చకుండా చూసుకుని ప్రభుత్వాన్ని గద్ది దింపాలనే లక్ష్యంగా ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయి .
అయితే వీరిని ఎదుర్కోవడంలో కానీ ప్రభుత్వ అభివృద్ధిని కానీ సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడంలో గాని అధికార పార్టీ పార్టీ వెనకబడినట్లుగా తెలుస్తుంది .భారతదేశంలో సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందు వరుసలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆ క్రెడిట్ ని తమ ఖాతాకు మళ్ళించుకోవడంలో వెనకబడే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ముఖ్యమంత్రి జగన్ తన ప్రసంగాలలో తరచూ చేసే ఆ విమర్శలను రిపీట్ చేస్తూ మాట్లాడటం ఓటర్ల ను ఆకట్టుకోవడం లేదని తెలుస్తుంది.గత కొన్ని సంవత్సరాలుగా ఒకే టెంప్లేట్లో జగన్ మాట్లాడుతున్నారు.
పవన్ కళ్యాణ్ పై కానీ చంద్రబాబుపై కానీ ఆయన చేసే విమర్శలలో పదును ఉండటం లేదని, అంశాలు వారీగా వీరిద్దరి పై విమర్శలను చేసి చీల్చి చెండాడే అవకాశం ఉన్నప్పటికీ అవే మూస విమర్శలతో జగన్ ముందుకి వెళ్తున్నారని ,అంతేకాకుండా చిన్నచిన్న విమర్శలను కూడా పేపర్ చూసి చదివే అలవాటు ప్రతిపక్షాలలో జగన్ ఇమేజ్ కు బారీ నష్టం కలిగిస్తుందని వార్తలు వస్తున్నాయి.తమ నాయకుడు పూర్తిస్థాయిలో గ్రౌండ్ వర్క్ చేసి ప్రతిపక్షాలను చీల్చి చెండాడుతుంటే చూడాలని ఉందంటూ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదిక వ్యాఖ్యలు చేస్తున్నారు మరి తమ అభిమాన కార్యకర్తల మాటలను అదినాయకుడు జగన్ ఎంత మేరకు పట్టించుకుంటారో చూడాలి
.