ఏపీ రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. టిడిపి టార్గెట్ గా వైసీపీ.
.వైసీపీ టార్గెట్ గా టీడీపీ( TDP ) ఇలా రెండు ప్రధాన వ్యూహ ప్రతి వ్యూహాలతో రాజకీయ వేడిని పెంచుతున్నాయి.ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉన్నప్పటికి.నువ్వా నేనా అన్నట్లుగా ఇప్పటి నుంచే పోటీ పడుతున్నాయి.గడిచిన నాలుగేళ్ళు సైలెంట్ గా ఉన్న వైసీపీ ప్రభుత్వం ఒక్కసారిగా టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.వచ్చే ఎన్నికల్లో టీడీపీని అన్నీ విధాలుగా దెబ్బ కొట్టేందుకు గట్టి ప్రయత్నలే చేస్తోంది.
అందులో భాగంగానే ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై ( Chandrababu )అలివిగాని కేసులను మోపుతోంది.

ఇప్పటికే స్కిల్ స్కామ్ లో చంద్రబాబు 53 రోజులుగా జైలు శిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే.ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చారాయన.అయితే కేవలం స్కిల్ స్కామ్ మాత్రమే కాకుండా ఫైబర్ గ్రేడ్ స్కామ్, అమరావతి రింగ్ ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్,.
.ఇలా మరికొన్ని కేసులు కూడా చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాయి.
ఇవే కాకుండా మరో 10 కేసులు ఆయన నమోదయ్యే అవకాశం ఉందని ఇటీవల వైసీపీకి చెందిన ఓ మంత్రి వ్యాఖ్యానించారు.దీన్ని బట్టి చూస్తే 2024 ఎన్నికలు పూర్తి అయ్యే వరకు చంద్రబాబును జైల్లోనే ఉంచే విధంగా జగన్ ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానాలు రాక మానవు.

అయితే పక్కా ప్రణాళిక బద్దంగా వెలుతున్న జగన్ ( CM jagan )కు ఊహించని విధంగా చంద్రబాబుకు బెయిల్ రావడం జీర్ణించుకోలేని విషయమే.ఆయన ఆరోగ్య నిమిత్తం నాలుగు వారాల బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది.అయితే చంద్రబాబు బయటకు రావడం వల్ల మళ్ళీ ఆయనపై ఎలాంటి కొత్త కేసులను మోపినా.ఆ ప్రభావం వైసీపీ పై గట్టిగానే పడుతుంది.ఎందుకంటే అవన్నీ కూడా కక్ష పూరితంగానే జరుగుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో నెలకొనే అవకాశం ఉంది.దాంతో చంద్రబాబుపై కొత్త కేసులు మోపడంపై జగన్ పునః ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
మొత్తానికి చంద్రబాబు బయటకు రావడం వల్ల తదుపరి ప్రణాళికల విషయంలో జగన్ డైలమాలో పడినట్లు తెలుస్తోంది.