నేడు ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. చెప్పనున్న జగన్ ప్రభుత్వం..!!

గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఏపీలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు నేడు సీఎం జగన్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనున్నారు.2021-22 ఏడాదిలో దాదాపు 10,143 పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఈ నేపథ్యంలో జూలై మాసంలో 1238 ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు.

అదే రీతిలో ఆగస్టులో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ లు విడుదల చేయనున్నారు.దీంతో ఎప్పటి నుండో ఏపీలో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు. తాజాగా ప్రభుత్వం రిలీజ్ చేయనున్న జాబ్ క్యాలెండర్ కొంత మేర రిలీఫ్ ఇచ్చినట్లయింది.పక్కా షెడ్యూల్ తో.నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యి నోటిఫికేషన్ల ఆధారంగా ప్రణాళికబద్ధంగా ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధం చేసుకునే రీతిలో జగన్ ప్రభుత్వం.క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం క్యాంపు కార్యాలయంలో చేయనున్నారు.

Jagan Governament Releasing Job Calendar Today, Ys Jagan, Andhra Pradesh, Jagan
Jagan Governament Releasing Job Calendar Today, YS Jagan, Andhra Pradesh, Jagan

ఇప్పటికే చాలా మంది నిరుద్యోగులు ఎప్పటినుండో ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తుందని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు.జగన్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన గాని మొన్నటి వరకు రిలీజ్ చేయకపోవడంతో కొంత అసహనం ప్రభుత్వంపై ఏర్పడింది.ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి జగన్ ప్రభుత్వం రెడీ అవటం తో .ఏపీలో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  .

Advertisement

తాజా వార్తలు