ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుగుతుండగా.
వైసీపీ కేడర్ అతనికి పెద్ద షాక్ ఇచ్చింది.
రాష్ట్రంలోని వైసిపి వర్గాల్లో ఉన్న అసంతృప్తి, ఆధిపత్య ధోరణి స్పష్టంగా బయటపడ్డాయి.వారి పార్టీలోనే ఎంతమంది నాయకులు మధ్య ఎన్ని సమాంతరాలు ఉన్నాయన్న విషయం తెలియజెప్పింది.
ఈ పుట్టినరోజు వేడుకల ద్వారా హిందూపురం నుండి శ్రీకాకుళం వరకు వైసిపి నేతల మధ్య ఉన్న పొరపొచ్చలు అన్నీ ఒకసారిగా బయటపడ్డాయి.వైసీపీ సైతం అంతర్గత కొమ్ములాటలు అతీతం కాదని నిరూపిస్తూ శ్రీకాకుళంలో స్పీకర్, మంత్రులు సీదిరి అప్పలరాజు , ధర్మాన ప్రసాదరావులు ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహించి తమలోని ఐకమత్యలేమిని నిరూపించారు.
విజయనగరంలో పార్టీ కీలక నాయకురాలుగా పేరు ఉన్న కిల్లి కృపారాని నిర్వహించిన కార్యక్రమానికి మిగిలిన నాయకులు ఎగ్గొట్టగా.విజయవాడలో మల్లాది కృష్ణ పాల్గొన్న కార్యక్రమానికి సైతం ఇదే తంతు జరిగింది.
ఇక మల్లాది ఇతర నేతలు చేపట్టిన కార్యక్రమాలకు వెళ్లకపోవడం కూడా జరిగింది.తిరుపతిలో సైతం ఇదే పరిస్థితి.
అక్కడైతే అసలు పెద్దగా సందడే లేదు.ఇక ఎంత కీలకమైన మాచర్లలో ఈ మధ్యనే టిడిపి వర్సెస్ వైసీపీ వార్ నడిస్తే ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలలో ఊపు అయితే అసలు కనిపించలేదు.
దీంతో పార్టీ కన్నా కూడా వారి పర్సనల్ కారణాలకి పెద్దపీట వేస్తున్నట్టు స్పష్టమైంది.
హిందూపురంలో అయితే ఎవరికి వారే యమునా తీరే అంటూ మూడు వర్గాలుగా చీలిపోయి పక్క పక్కనే పందిళ్లు వేసి కార్యక్రమాలు నిర్వహించుకున్నారు.సరే.జగన్ పుట్టినరోజులు వేడుకలు సక్రమంగా జరిగాయా అంటే అది లేదు.ఎమ్మెల్సీ ఇక్బాల్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు వివాదాలతోనే రోజంతా గడిచిపోయింది.
ఇక జగన్ పుట్టినరోజు వేడుకల్లో లోకల్ నాయకులంతా తమ బలబలాలు నిరూపించుకునేందుకు ఆధిపత్య ధోరణి ప్రదర్శించేందుకు మొగ్గు చూపారే కానీ ఎవరికీ ప్రజల్లోకి జగన్ పేరును, అతని సంక్షేమ పథకాలను తీసుకొని వెళ్లాలన్న ఆలోచన లేకపోవడం గమనార్హం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy