పోస్టర్ పాలిటిక్స్: విజయ్ చెవిలో జగన్ పీకే గుసగుసలు

తమిళ ప్రజలకు ఆనందం వచ్చినా, ఆగ్రహం వచ్చినా ఏదైనా కొత్త ఆలోచన వచ్చినా దాన్ని దాచుకోరు వెంటనే ఏదో రూపంలో బయట పెట్టేస్తుంటారు.ఇప్పుడు ఆ విధంగానే తమిళ సూపర్ స్టార్ విజయ్ అభిమానులు ఏపీ సీఎం జగన్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు సంబంధించిన ఫోటోలతో ఓ పోస్టర్ ను తమిళనాడులోని మధురై లో ఏర్పాటు చేశారు.

 Jagan And Vijay And Pk Poster Politics-TeluguStop.com

విజయ్చెవిలో జగన్, ప్రశాంత్ కిషోర్ ఏదో చెబుతున్నట్లుగా ఉంది.ఏపీని మేము కాపాడుకున్నాం, ఇబ్బందుల్లో ఉన్న తమిళనాడును మీరే కాపాడుకోవాలి అంటూ జగన్ విజయ్ చెవిలో చెబుతున్నట్లుగా ఈ పోస్టర్ లో ఉంది.

దీంతో ఈ పోస్టర్ బాగా వైరల్ అయింది.ఇటీవల విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం విజయం ఎక్కువగా జరుగుతోంది.

దీనికి అనుగుణంగానే విజయ్ కి ఐటీ నోటీసులు రావడం, బిజెపి కావాలని విజయ ను టార్గెట్ చేసుకుందనే ప్రచారం ఊపందుకోవడంతో విజయ్ అభిమానులు బీజేపీ పై మండిపడుతున్నారు.

Telugu Ap Cm Jagan, Jaganprashanth, Jaganvijay, Tamil Vijay, Vijay, Vijay Pk, Vi

విజయ్ ను చాలా కాలం నుంచి తమిళ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సిందిగా అభిమానులు కోరుతున్నారు.ఆయన కూడా దీనికి సముకంగానే ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.దీంతో ఇప్పుడు ఈ పోస్టర్లు ఈ రకంగా వెలువడడం కలకలం రేపుతోంది.

విజయ్ ఫోటో సరే , ఆయన పక్కన జగన్, ప్రశాంత్ కిషోర్ ఫోటోలను ఏర్పాటు చేయడం వెనుక అర్థాలు చాలానే కనిపిస్తాయి.ప్రశాంత్ కిషోర్ ఇటీవల దేశ రాజకీయాల్లో బాగా పేరు సంపాదించుకున్నారు.

ఆయన సలహాలు, సూచనలు ఇచ్చిన పార్టీలు ఎన్నికల్లో విజయం సాధిస్తున్నాయి.

Telugu Ap Cm Jagan, Jaganprashanth, Jaganvijay, Tamil Vijay, Vijay, Vijay Pk, Vi

ఆ విధంగానే ఇటీవల ఏపీ ఎన్నికల్లో కూడా జగన్ భారీ మెజార్టీతో 151 సీట్లు గెలుచుకున్నారు.దీంతో ప్రశాంత్ కిషోర్ సేవలు వినియోగించుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.తాజాగా ఢిల్లీ ఎన్నికలలో క్రేజీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందింది అంటే అది పీకే సలహాలు కారణమనే వాదన తెరపైకి వస్తోంది.

అందుకే విజయ్ అభిమానులు పోస్టర్ ను ఈ విధంగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube