దుబాయ్ లో భారతీయుడికి జాక్ పాట్...వచ్చిన డబ్బును ఏం చేశాడో తెలిస్తే షాకే...

యూఏఈ  దేశాలలో లాటరీ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది భారతీయులే ఎందుకంటే అక్కడ అత్యధిక శాతం లాటరీ అదృష్టం స్థానికుల కంటే కూడా భారతీయులను వరిస్తుంది.

అదేంటో ఎంతో మంది వలస జీవులు ఉన్నా భారతీయులనే ప్రత్యేకంగా దుబాయ్ లాటరీలు వరించడం ఇప్పటికి అర్థం కాని విషయమే.

ఆయా దేశాలలో లక్కీ డ్రాలు ఎన్ని తీసినా సరే అందులో భారతీయుడి పేరు ఏదొక స్థానంలో వినిపిస్తుంది.తాజాగా భారత్ కు చెందిన జోధి అనే వ్యక్తి రెండు రోజుల క్రితం దుబాయ్ మహాజూజ్ డ్రాలో రూ.20 లక్షలు గెలుపొందాడు.ఇప్పటి వరకూ ఎంతో మంది భారతీయులు ఇంతకంటే అధిక మొత్తంలో కోట్ల రూపాయలలో లాటరీలు గెలుచుకున్నా పెద్దగా వారి పేరు వార్తల్లో నిలిచింది లేదు.కానీ జోధి కేవలం రూ.20 లక్షలు గెలుచుకున్నా సరే వార్తల్లో నిలవడానికి కారణం లక్కీ డ్రాలో తన పేరు ఉందని తెలిసిన వెంటనే తాను చేసిన ఓ ప్రకటనే అందుకు కారణం.అదేంటంటే.

దుబాయ్ లో ఓ ప్రవైటు సంస్థలో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న 51 ఏళ్ళ జోధి ఎన్నో సార్లు లాటరీలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారట.కానీ ఏ ఒక్క సారి తనకు అదృష్టం రాలేదని ఈ సారి తన ప్రయత్నం వృధా కాలేదని అయితే తాను లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేయడానికి కారణం వచ్చిన డబ్బు మొత్తాన్ని తాను నిర్వహించే చారిటీ సంస్థకు డొనేట్ చేయడానికేనని, ప్రస్తుతం వచ్చిన రూ.20 లక్షలు మొత్తాన్ని తాను పేదల కోసం నిర్వహించే సంస్థకు ఇచ్చేస్తున్నానని ప్రకటించారు.జోధి ప్రకటనతో నెటిజన్లు ఫిదా అయ్యారు.

ఎవరైనా కొంత డబ్బు చారిటీకి ఖర్చు చేస్తారు కానీ గెలుపొందిన మొత్తం చారిటీకి ఖర్చు చేయాలనుకోవడం తమని షాక్ కి గురిచేసిందని జోధి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

తాజా వార్తలు