బాలీవుడ్ లో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు జాకీ ష్రాఫ్.వెటరన్ రొమాంటిక్, యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఇతను ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉన్నాడు.
ఒక వైపు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు సౌత్ సినిమాలలో కూడా విలన్ పాత్రలలో కనిపించి మెప్పిస్తున్నాడు.అస్త్రం సినిమాతో టాలీవుడ్ లోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చిన జాకీ ష్రాఫ్ సౌత్ లో కూడా మంచి సినిమాలు చేస్తున్నాడు.
పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ కి విలన్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించి మెప్పించాడు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా రజినీకాంత్ కి ప్రతినాయకుడుగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం తమిళంలో శివ దర్శకత్వంలో అన్నాత్తై అనే సినిమా చేస్తున్నాడు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం జాకీష్రాఫ్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రం షూటింగ్ చాలావరకు లాక్ డౌన్ కి ముందే జరిగింది.అయితే, ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలివుంది.దీనిని చెన్నైలో సెట్స్ వేసి షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నారు.కరోనా పరిస్థితుల కారణంగా రజినీకాంత్ ఇప్పట్లో షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదు.
అయితే మిగిలిన నటులు ఉన్న సన్నివేశాలు పూర్తి చేసిన తర్వాత ఫైనల్ గా రజినీకాంత్ కాంబినేషన్ సన్నివేశాలు చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు.ఇక సినిమాలో కుష్బూ, మీనా, నయనతార హీరోయిన్స్ గా నటిస్తూ ఉండగా రజినీకాంత్ కూతురు పాత్రలో కీర్తి సురేష్ కనిపించ బోతుంది.
ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల లోపు ఈ సినిమా రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుంది అనేది వేచి చూడాలి.