Jabardasth Rohini : నంది అవార్డ్ రాలేదంటూ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ రోహిణి.. ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు వేసిందా?

తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ లేడీ కమెడియన్, నటి రోహిణి( Actress Rohini ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తెలుగులో ఎన్నో సినిమాలలో, సీరియల్స్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది.

నటిగా మంచి పాపులారిటీని ఏర్పరుచుకున్న రోహిణి బిగ్ బాస్ హౌస్( Bigg Boss House ) లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది.కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది.

ఇటీవలె విడుదల అయిన హనుమాన్ సినిమాలో రోహిణి తన కామెడీ టైమింగ్‌తో అందరినీ నవ్వించింది.

ఇకపోతే రోహిణి ప్రస్తుతం బిగ్ బాస్, సీరియల్స్, ఈవెంట్లు, బుల్లితెర షోలు అంటూ రోహిణి ఫుల్ బిజీ బిజీగా ఉంటోంది.కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్‌కు గానూ తనకు నంది అవార్డు ప్రకటించారట.కానీ ఇంత వరకు ఆ అవార్డును మాత్రం ఇవ్వలేదంటూ బాధపడింది రోహిణి.

Advertisement

తాజాగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.అయితే రోహిణి చేసిన ఆ కామెంట్స్ పై కొందరు మండిపడుతున్నారు.

ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాయి కదా? ఇవన్నీ గుర్తుకు వస్తాయని ఒకరు ఇంకా అవార్డు ఇవ్వలేదని ఏపీ ప్రభుత్వం( AP Govt ) మీద రోహిణి కౌంటర్ వేసిందా? అని మరొకరు ఇలా ఎవరికి నచ్చినట్టుగా వారు కౌంటర్లు వేస్తున్నారు.

రోహిణి మాట్లాడుతూ.

నా ఫస్ట్ సీరియల్‌కే నంది అవార్డు( Nandi Award ).కానీ ఇంత వరకు రిసీవ్ చేసుకోలేదు.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు

ఏది ఏమైనా ఇది నా జీవితంలో ఒక అందమైన మెమోరీ.కొంచెం ఇష్టం.

Advertisement

కొంచెం కష్టం.నేను ఎప్పుడో సాధించిన ఆ మెమోరీని అందరితో షేర్ చేసుకోవాలనిపించింది అంటూ రోహిణి వేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

కాగా రోహిణి ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ,జబర్దస్త్, పండుగ ఈవెంట్ లు అంటూ బిజీగా గడుపుతోంది.