జబర్దస్త్ కమెడియన్ కొమరం( Jabardasth Komaram ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ లో( Jabardasth ) ఎన్నో స్కిట్లలో లేడీ గెటప్ లు వేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి కమెడియన్ గా( Comedian ) తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.
మరి ముఖ్యంగా జబర్దస్త్ లో పశువులంటే మాకు ప్రాణం అన్న ఒకే ఒక స్కిట్ తో భారీగా క్రేజ్ ను ఏర్పరచుకున్నాడు కొమరం.చాలామంది కొమరం అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ కొమరక్క అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు.
జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ కొమరం పండుగ స్పెషల్ ఈవెంట్లలో కామెడీ చేయడంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా పాల్గొంటూ ఉంటారు.

ఇక సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టిన కొమరం రకరకాల పల్లెటూరి వీడియోలు తీస్తూ ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యాడు.ప్రస్తుతం కొమరం సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్నాడు.ఇటీవల నాని నటించిన దసరా సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కొమరం తన జీవితంలో ఎదురైనా చేదు సంఘటన గురించి పంచుకున్నాడు.ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకున్నాడు కొమరం.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో.మాట్లాడుతూ నా పేరు కొమరం.
అయినా కూడా కొమరక్క అని పేరు పెట్టుకున్నాను.కొమరక్క అంటే ఎవరిని లెక్క చేయదు అని అర్థం.

నన్ను చాలామంది బయట కొమరక్క అని అంటారు.చాలా మందికి కొమరక్క అంటే ఒక మహిళ అని మాత్రమే తెలుసు అని చెప్పుకొచ్చాడు కొమరం.ఇండస్ట్రీకి రాకముందు అన్ని రకాల పనులు చేశాను.హైదరాబాదులో సిగ్నల్స్ దగ్గర స్కూల్ బ్యాగులు గొడుగులు అమ్మే వాడిని.కోఠిలో నిలబడే వస్తువులు అమ్మే వాడిని.ఆ పనులన్నీ ఇష్టంతో చాలా సంతోషంగా చేశాను.
కొద్దిరోజులు ఫోటోలో కూడా పనిచేశాను క్యాటరింగ్ లో కూడా పనిచేశాను.పాత్రలు కడిగే వాడిని.
ఇవన్నీ ఇండస్ట్రీకి రాకముందు చేశాను.వచ్చిన తర్వాత కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను.
చివరికి సక్సెస్ అయ్యాను అని ఎమోషనల్ అవుతూ తెలిపారు కొమరం.పదవ తరగతి మాత్రమే చదివిన నాకు ఇంత పేరు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు.
ప్రస్తుతం సినిమాలలో బిజీ బిజీ అవడం వల్ల కామెడీ షో నుంచి బయటకు వచ్చేసాను అని తెలిపారు కొమరం.
