తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు ఢిల్లీలో ఉన్నారన్న మాట వాస్తవమేనని ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు.
మధు యాష్కీ సహా బీసీ నేతల్లో కొందరు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను కలిశారని పేర్కొన్నారు.
అయితే గ్రూపులుగా రావొద్దని కాంగ్రెస్ అధిష్టానం తమకు చెప్పిందని వీహెచ్ అన్నారు.
విడిగా కలిసేందుకు కూడా కొందరికి అవకాశం ఇచ్చారని చెప్పారు.కుల గణన చేయాలని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.
ఈ క్రమంలో షాద్ నగర్ లో నిర్వహించే సభలో బీసీ డిక్లరేషన్ ఉంటుందని ఆయన వెల్లడించారు.బీసీలకు కనీసం 34 సీట్లు ఇస్తారన్న నమ్మకం ఉందని తెలిపారు.
మోదీ పేరుకే బీసీ అన్న ఆయన మోదీ బీసీలకు చేసిందేమీ లేదని విమర్శించారు.
.