తానా తెలుగు వారందరికి అమెరికాలో అండగా నిలుస్తున్న అతిపెద్ద తెలుగు ఎన్నారైల సంస్థ.తానా సభలకి ఇండియా నుంచీ కూడా రాజకీయ నాయకులు, సినిమా నటులు, ఎంతో మంది పముఖులు వెళ్తుంటారు.
అయితే త్వరలో వాషింగ్టన్ డీసిలో నిర్వహించనున్న తానా మహాసభలకు ఏర్పాట్లు చురుకుగా చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సభలకి మా వంతు సహకారం అందిస్తామని వాషింగ్టన్ డీసి మెట్రో ఏరియాలోని ఐటీ బిజినెస్ కమ్యూనిటీ ప్రకటించింది.
దాదాపు 100 ఐటీ సంస్థల అధినేతలు, ఐటీ డైరెక్టర్లు, సిఇఓలతో ఇక్కడ జరిగిన సమావేశంలో ఈ మేరకు ఈ వివరాలని ప్రకటించారు.ఆర్థికంగా, మౌళికంగా, వలంటీర్‌గా సహకారాన్ని తాము ఇస్తామని కూడా వారు హామి ఇచ్చారు.తానా అధ్యక్షుడు సతీష్ వేమన ఈ సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తానా మహాసభలను వచ్చే సంవత్సరం జూలై 4,5,6 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
అయితే ఈ మహాసభలకు తమవంతుగా స్వచ్చందంగా ముందుకు వచ్చిన ఐటీ కమ్యూనిటీకి సతీష్ వేమన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గౌతం అమర్నేని.జయంత్ చల్ల…పూర్ణ డొక్కు.ప్రకాశ్ బత్తినేని.రామ్ మట్టపల్లి.లక్స్ చేపూరి తదితరులు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి తానాకు మద్దతును అందిస్తున్నట్లు ప్రకటించారు.
.