విశ్వక్ సేన్ మెకానిక్ రాఖీ తో సక్సెస్ సాధించాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు.

ప్రజెంట్ ఉన్న యంగ్ హీరోలు వరుస సినిమాలు చేయడమే కాకుండా వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ముందు వరుసలో ఉన్నారు.

ప్రస్తుతం విశ్వక్ సేన్, విజయ్ దేవరకొండ, నితిన్, నిఖిల్ లాంటి హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుతున్నారు.ఇక అందులో భాగంగా ఈరోజు విశ్వక్ సేన్( Vishwak Sen ) హీరోగా వచ్చిన మెకానిక్ రాఖీ( Mechanic Rocky Movie ) సినిమా ప్రేక్షకులను కొంతవరకు మెప్పించిందనే చెప్పాలి.

Is Vishwak Sen Successful With Mechanic Rocky Details, Vishwak Sen , Mechanic R

అయితే ఈ సినిమాలో విశ్వక్ సేన్ అద్భుతంగా అనిపించినప్పటికి స్క్రీన్ ప్లే వైస్ గా చూసుకుంటే మాత్రం ఈ సినిమా కొంతవరకు తగ్గిందని సగటు ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం.ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు కూడా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో మాత్రం చాలా వరకు వెనకడుగు వేస్తున్నాడనే చెప్పాలి.తన గత సినిమా అయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి( Gangs Of Godavari ) ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.

Is Vishwak Sen Successful With Mechanic Rocky Details, Vishwak Sen , Mechanic R

దాంతో ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తారని అందరూ అనుకున్నారు.ఇక ఈ సినిమా ఓకే అనిపించినప్పటికి ట్రైలర్ కట్ మాత్రం అంతా ఎంగేజింగ్ లేకపోవడంతో సినిమా మీద మొదటి నుంచి కూడా అంచనాలైతే లేకుండా పోయాయనే చెప్పాలి.ఇక ప్రస్తుతం ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ అది విశ్వక్ సేన్ రేంజ్ కు తగ్గ సక్సెస్ అయితే కాదని మరి కొంతమంది తెలియజేయడం విశేషం.

Advertisement
Is Vishwak Sen Successful With Mechanic Rocky Details, Vishwak Sen , Mechanic R

ఈ సంవత్సరంలో విశ్వక్ సేన్ వరుస సినిమాలు రిలీజ్ చేస్తున్నప్పటికి ఆయనకు సక్సెస్ అయితే చాలా రేర్ గా దక్కుతుందనే చెప్పాలి.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు