రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) లైగర్ సినిమా సమయంలోనే ఖుషి సినిమా( Khushi movie )ను మొదలు పెట్టాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది.లైగర్ విడుదలైన తర్వాత ఖుషి సినిమాను మొదలు పెట్టిన విజయ్ దేవరకొండ కేవలం మూడు నాలుగు నెలల్లోనే ఖుషి తో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ అంతా అనుకున్నారు.
అయితే సమంత ( Samantha )అనారోగ్య సమస్యల కారణంగా సినిమా చాలా ఆలస్యం అయింది.ఎట్టకేలకు సమంత అనారోగ్య సమస్యల నుండి బయట పడింది.
ఆమె హీరోయిన్ గా వరుసగా సినిమాలకు కమిట్ అవుతుంది.
అంతే కాకుండా సమంత ఇటీవల ఖుషి సిసినిమా చిత్రీకరణలో కూడా పాల్గొంటుంది.హీరోయిన్ గా సమంత ఖుషి సినిమా మాత్రమే కాకుండా శాకుంతలం సినిమా( Sakunthalam ) లో కూడా నటించింది.ఆ సినిమా చిత్రీకరణ పూర్తి అయి విడుదలకు సిద్ధం అవుతుంది.
అతి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న కారణంగా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
అదుగో ఇదుగో అంటూ సినిమా యొక్క విడుదల తేదీని జరుపుతూ వచ్చిన మేకర్స్ తాజాగా సమంత తో ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ చేయిస్తున్నారు.ఖుషి సినిమా షూటింగ్ ను పక్కన పెట్టి శాకుంతలం సినిమా యొక్క ప్రమోషన్ లో సమంత పాల్గొంటుంది.దాంతో ఖుషి సిసినిమా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది.
అయితే ఇప్పటికే సెప్టెంబర్ 1న ఖుషి విడుదల అవుతుందని ప్రకటించిన యూనిట్ సభ్యులు రౌడీ స్టార్ అభిమానులకు షాక్ ఇస్తూ విడుదల వాయిదా వేస్తారా ఏంటీ అంటూ అభిమానులు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఖుషి సినిమా విడుదల తేదీకి సమయం చాలానే ఉంది.
కనుక ఇప్పటి నుండే విడుదల వాయిదా అంటూ ఆందోళన చెందాల్సిన పనిలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.