వల్లభనేని వంశీ అరెస్ట్ తప్పదా ? ప్రత్యేక బృందాల గాలింపు ?

వైసిపి నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్( Vallabhaneni Vamsi Mohan ) అరెస్టుకు రంగం సిద్ధమైంది.

గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి కేసులో వల్లపునేని వంశీ నిందితుడిగా ఉన్నారు.

ఇప్పటికే ఈ కేసులో 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.వంశీ ప్రోద్బలం తోనే టిడిపి కార్యాలయం పై దాడులు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు.

టిడిపి కార్యాలయం పై దాడి జరిగిన సమయంలో గన్నవరం ఎమ్మెల్యే గా ఉన్న వంశీ తన అనుచరులను రెచ్చగొట్టడం వల్లనే దాడి జరిగిందని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.ప్రస్తుతం ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడడంతో వంశీని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

వంశీ హైదరాబాదులో ఉన్నారని తెలుసుకుని మూడు ప్రత్యేక బృందాలు ఆయన కోసం అక్కడికి వెళ్లాయి.ఎన్నికల ఫలితాలు తర్వాత నుంచి వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు.అయితే ఆయన హైదరాబాదులో ఎక్కడ ఉంటున్నారు అనేది క్లారిటీ లేదు.

Advertisement

అసలు ఆయన హైదరాబాద్( Hyderabad ) లో ఉన్నారా లేక అమెరికా వెళ్లారా అనేది ఇంకా క్లారిటీ లేదు.ఈ మేరకు మూడు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టి వంశీ కోసం వెతుకులాట మొదలుపెట్టాయి.

వాస్తవంగా టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన మొదట్లోనే వంశీని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది.కొంతమంది టిడిపి శ్రేణులు గన్నవరంలోని వంశీ నివాసం వద్ద రాళ్ల దాడికి సైతం దిగారు .ఆ సమయంలోనే హైదరాబాద్ వెళ్ళిపోయిన వంశీ ఇక అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉంటున్నారు.

గత వైసిపి ప్రభుత్వం లో టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu )తో పాటు , ఆయన కుటుంబ సభ్యుల పైన వంశీ అనుచిత వ్యాఖ్యలు చేయడం పెద్ద సంచలన సృష్టించింది.వంశీ అప్పట్లో చేసిన వ్యాఖ్యలతోనే చంద్రబాబు కన్నీటి పర్యంతం కావడం,  తాను వైసిపి ప్రభుత్వం ఉండగా అసెంబ్లీలో అడుగు పెట్టనని శపదం చేయడం వంటివన్నీ జరిగాయి.అప్పటి నుంచి వంశీ పై ఆగ్రహంతోనే ఉంటున్న చంద్రబాబు ఇప్పుడు గన్నవరం టిడిపి కార్యాలయం దాడి వ్యవహారం లో వంశీని అరెస్టు చేయించాలని పట్టుదలతో ఉన్నారు.

జగన్ చేస్తున్న డిమాండ్ అమలు సాధ్యమేనా ? 
Advertisement

తాజా వార్తలు