ఓర్నీ... బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునేది ఇందుకేనా రేవంతూ ? 

ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు చాలామంది కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు.

బిఆర్ఎస్ లోని కీలక నేతలతో పాటు , వరుసుగా ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతుండడం బీఆర్ఎస్ లో ఆందోళన పెంచుతుంది.

పెద్ద ఎత్తున పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతుండడంపై ఆయా నియోజకవర్గల్లోని కాంగ్రెస్ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నా.  తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు,  సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

అధిష్టానం పెద్దలు సైతం రేవంత్ కు మద్దతుగా నిలుస్తూ,  చేరికలను ప్రోత్సహిస్తున్నారు.  అయితే కాంగ్రెస్ కు సరిపడా బలం ఉన్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఈ స్థాయిలో చేర్చుకోవడం వెనుక కారణాలు ఏమిటి అనేది ఎవరికీ అంతు పట్టడం లేదు.

ఇప్పటికే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు.

Is This Why Revanthu Is Including Brs Mlas, Brs, Bjp, Congress, Kcr, Revanth Red
Advertisement
Is This Why Revanthu Is Including BRS MLAs, BRS, BJP, Congress, KCR, Revanth Red

గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ( MLA Krishnamohan Reddy )బీఆర్ఎస్ ను  వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు.  ఇంకా మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.  అసలు రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో ఎమ్మెల్యేల చేరికలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.

  గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకుని కాంగ్రెస్ ను బాగా బలహీనం చేయడంతోనే , దానికి ప్రతీకారంగా రేవంత్ ఇప్పుడు బీఆర్ఎస్( BRS ) ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారనే అభిప్రాయాలు అందరిలోనూ ఉన్నాయి .అయితే దీనికి మరో కారణం కూడా ఉందట.  2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు  బొటా బోటి గా మెజారిటీ వచ్చింది.

  మ్యాజిక్ ఫిగర్ కు అతి దగ్గరగా ఉంది.

Is This Why Revanthu Is Including Brs Mlas, Brs, Bjp, Congress, Kcr, Revanth Red

బీఆర్ఎస్ కు సీట్లు బాగానే వచ్చాయి.  అలాగే బీజేపీ కూడా ఎనిమిది అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది.దీంతో కాంగ్రెస్( Congress ) ను అధికారం నుంచి దించేందుకు బిజెపి ఎంతకైనా తెగిస్తుందని ,  ప్రభుత్వాన్ని కూలగొట్టి అవసరమైతే కేసీఆర్ కు బయట నుంచి మద్దతు ఇచ్చేందుకు కూడా బిజెపి వెనకాడదని కాంగ్రెస్ భావిస్తుంది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

  అందుకే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను లాక్కుని ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కూడా ప్రయత్నిస్తుందనే అనుమానం కాంగ్రెస్ పెద్దల్లో ఉండడంతోనే,  అధిష్టానం పెద్దల సూచనలతో బీఆర్ఎస్ మ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారట.  మహారాష్ట్రలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని చీల్చి అధికారాన్ని దక్కించుకున్న సంఘటనలను కాంగ్రెస్ గుర్తు చేసుకుంటూ.

Advertisement

  బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరికలను ప్రోత్సహించి తమ పార్టీలో చేర్చుకుంటూ తమ బలాన్ని పెంచుకునే విధంగా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది.

తాజా వార్తలు