పదో తరగతి ప్రశ్నా పత్రాలు లీకేజీ వ్యవహారంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) ను అర్ధరాత్రి సమయంలో పోలీసులు అరెస్టు చేయడమే కాకుండా, కోర్టులో హాజరు పరిచి రిమాండ్ పడే విధంగా వ్యూహత్మకంగా తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్( BRS ) వ్యవహరించింది.
అంతే కాదు , ఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎ 1 నిందితుడుగాను సంజయ్ ను చేర్చారు.
తెలంగాణ బిజెపి అధ్యక్షుడి హోదాలో ఉన్న బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం వంటి విషయాల్లో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.బిజెపి ( BJP )ఆత్మరక్షణలో పడేవిధంగా చేయగలిగారు.
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ), టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు, వంటి వాటి విషయాల్లో బీఆర్ఎస్ కీలక నాయకులను ఇబ్బంది పెట్టే విధంగా బిజెపి వ్యవహారాలు చేస్తుండడంతో, ఇక ఆ పార్టీ విషయంలో ఎదురు దాడి చేయాలని కెసిఆర్ నిర్ణయించుకున్నారు .దీనిలో భాగంగానే ఎప్పటికప్పుడు బిజెపి వ్యూహాలను ముందుగానే పసిగట్టి, ఎక్కడా బిజెపికి అవకాశం దక్కకుండా చేయాలని కెసిఆర్ నిర్ణయించుకోవడంతో పాటు, బిజెపి స్లీపర్ సెల్ఫ్ పైన ప్రత్యేకంగా నిఘా పెట్టారట.ఇప్పటికే బీజేపీతో పాటు, ఆ పార్టీ అనుబంధ సంఘాలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉండడం, కేంద్ర బీజేపీ పెద్దల వ్యూహాలను తెలంగాణలో అమలు చేస్తూ, రాబోయే ఎన్నికల్లో పై చేయి సాధించే విధంగా ప్రయత్నాలు చేస్తుండడంతో, బిజెపి దూకుడుకు బ్రేకులు వేసే విధంగా కేసీఆర్ ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
దీనిలో భాగంగానే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను ముందుగా టార్గెట్ చేసుకున్నారు.
పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ విషయంలో అసలు ఏవిధంగా ప్రశ్నాపత్రాలు బయటకు వచ్చాయి అనే విషయంపై ముందుగానే బిఆర్ఎస్ మంత్రులతో పెద్ద ఎత్తున బిజెపిపై ఎదురు దాడి చేయించడంతో పాటు, ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా బండి సంజయ్ ను చేర్చి జైలుకు పంపించారు.ముందు ముందు ఇదే తరహాలో బిజెపి పై పోరాటం చేస్తామని, ఏ విషయంలోనూ వెనక్కి తగ్గేదే లేదు అనే సంకేతాలను బిజెపి పెద్దలకు కేసిఆర్ పంపించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy