తెలుగుదేశం జనసేన పొత్తులు( TDP ) మలి దశకు చేరుకున్నాయా? ముఖ్యంగా ఇరు పార్టీల మధ్య అభ్యర్థుల ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లుగా జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి .అంతర్గత సర్దుబాట్లను ఆ రెండు పార్టీలు పూర్తిచేసుకుని అభ్యర్థులు ప్రకటనకు సిద్ధమయ్యాయని ఆ దిశగా పార్టీ క్యాడర్ ను సిద్ధం చేయడానికి ఇరు పార్టీలు కీలకమైన సమావేశాలను నిర్వహిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి .
ముఖ్యంగా జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పవన్( Pawan kalyan ) మాట్లాడిన వైఖరి ముందస్తు ప్రిపరేషన్ లాగే ఉందని ముఖ్యంగా పార్టీలోని అసంతృప్తి స్వరాలను ఆయన వారించిన పద్ధతి చూస్తుంటే జనసేన సీట్ల సర్దుబాటుపైలు ఒక అంచనాకు జనసేనా ని వచ్చారని అందుకే అంతర్గత అసంతృప్తులు పెరగకుండా ఒక ముందస్తు వ్యూహం ప్రకారమే జనసైనికులను పవన్ అదుపు చేస్తున్నారని విశ్లేషణలు వస్తున్నాయి.
తమకున్న వాస్తవ బలాన్ని అనుసరించే సీట్లకు ఒప్పుకోవాలని, ఇందులో ఎటువంటి బేషజాలకు తావివ్వకూడదనే దృఢ సంకల్పంతో పవను ఉన్నారని, ఖచ్చితంగా గెలిచే సీట్ల మాత్రమే ఆశించాలని తమ బలాన్ని వాస్తవ దృక్కోణంతో బేరీజు వేసుకొని సీట్లు తీసుకోవాలి తప్ప లేనిపోని బేషజాలకు పోయి పొత్తు లక్ష్యాన్ని పలుచన చేయకూడదని పవన్ అభిమతమని తెలుస్తుంది , అందువల్లనే సీట్లు తగ్గినా కూడా జనసైనికుల నుంచి పార్టీ అభిమానుల నుంచి ఎటువంటి ఒత్తిడి రాకుండా సామాజిక వర్గ తలపోట్లను తప్పించుకోవడానికే ముందస్తు జాగ్రత్తగా ఒక కులంతో రాజకీయాలు చేయలేమన్న వ్యాఖ్యలు దానిని ఉద్దేశించినవే అన్నది విశ్లేషకులు అంచనా.
తద్వారా తాను స్పష్టమైన లక్ష్యంతోనే పవర్ గేమ్ ఆడుతున్నానని రాజకీయ అధికారం పై పట్టుదలతోనే ఉన్నానని సంకేతాలు ఇవ్వడానికే పవన్ కాస్త ఆవేశం గా మాట్లాడారని తెలుస్తుంది.తనని అర్దం చేసుకోలేని వారు పార్టీ వీడినా సంతోసమే అన్న వాఖ్యలు ముఖ్యం మరిన్ని కఠిన మైన నిర్ణయాల దిశగా పార్టీ శ్రేణులను సిద్దం చేయడానికి ముందస్తు వ్యూహమే అని రాజకీయ పరిశీలకులు విశ్లేసిస్తున్నారు .