చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరిలో అదే ఒక్కటే తేడా..?

మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు అన్నదమ్ములు అయినప్పటికీ స్టార్ హీరోలుగా చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్నారు.

అయితే చిరంజీవి( Chiranjeevi ) పొలిటికల్ పార్టీ పెట్టి అక్కడ సక్సెస్ కాలేక ఆ పార్టీ ని కాంగ్రెస్ లో కలిపేసి మళ్ళీ సినిమాలు చేయడానికి ఇండస్ట్రీకి వచ్చాడు.

ఇక పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లాంటి స్టార్ హీరో మాత్రం సినిమాలు చేస్తూనే జనసేన( Janasena ) అనే పొలిటికల్ పార్టీ ని పెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన రాజకీయ శైలిని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

Is That The Only Difference Between Chiranjeevi And Pawan Kalyan Details, Chira

మరి ఇలాంటి క్రమంలో ఆయన ఎన్నో ఎదురుదెబ్బలను తిన్నాడు.అయినప్పటికీ వాటిలో ఓర్చుకొని నిలబడ్డాడు.కాబట్టి ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి గేమ్ చేంజర్ గా మారాడు.

అయితే చిరంజీవి పవన్ కళ్యాణ్ లో ఉన్న తేడా ఏంటి అంటే చిరంజీవి ఎవరైనా తనను తిడితే తట్టుకోలేడు.కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వాటన్నింటికీ తెగించే వచ్చాడు.

Advertisement
Is That The Only Difference Between Chiranjeevi And Pawan Kalyan Details, Chira

కాబట్టి తనను తిట్టిన, డి గ్రేడ్ చేసిన బ్లాక్ మెయిల్ చేసిన ఏది చేసిన కూడా తను జనానికి సేవ చేయడమే తన అంతిమ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు కాబట్టి తను ఈజీగా సక్సెస్ అవ్వగలుగుతున్నాడు.ఇక పవన్ కళ్యాణ్ లో ఉన్నంత ధైర్యం, తెగింపు చిరంజీవిలో లేదు.

అందువల్లే ఆయన పొలిటికల్ గా సక్సెస్ అవ్వలేకపోయాడు.

Is That The Only Difference Between Chiranjeevi And Pawan Kalyan Details, Chira

ఇక పొలిటికల్ గా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఎన్నో విమర్శలు చేస్తూ ఉంటారు.కొంతమంది అయితే పర్సనల్ అటాక్స్ కూడా చేస్తుంటారు.అయినప్పటికీ వాటిని తట్టుకొని ముందుకు సాగినప్పుడే ఇక్కడ మనం నిలబడగలుగుతాం అనేది పవన్ కళ్యాణ్ చేసి చూపించాడు.

ఇక తను అనుకున్నట్టుగానే తన మీద విమర్శలు చేసిన వైసీపీ పార్టీ( YCP Party ) రూపురేఖలు లేకుండా భూస్థాపితం చేసేశాడు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు