ఎవడే సుబ్రమణ్యం సినిమా( Yevade Subramanyam )తో డైరెక్టర్ గా మారిన నాగ్ అశ్విన్ ఈ సినిమాతో మ్మచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు ఇక తన రెండో సినిమాగా సావిత్రి గారి బయోపిక్ అయిన మహానటి సినిమాని తీసి భారీ హిట్ అందుకున్న నాగ్ అశ్విన్ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు…ఇక ఇప్పుడు ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ ని హీరోగా పెట్టీ ప్రాజెక్ట్ కే( Project K ) అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే…ఇక నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా గ్లింప్స్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది.ఈ గ్లింప్స్ కు ఇప్పటివరకు 7.3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.గంట గంటకు వ్యూస్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
అయితే ప్రాజెక్ట్ కేలో అమితాబ్ పాత్ర చనిపోతుందని ప్రచారం జరుగుతోంది.ప్రభాస్, అమితాబ్ కాంబోలో సీన్లు ఉండవని అమితాబ్ పాత్ర మరణం తర్వాతే ప్రభాస్ పాత్ర( Prabhas ) ఎంట్రీ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
div class=”middlecontentim

ప్రాజెక్ట్ కే సినిమా బడ్జెట్ కు న్యాయం చేస్తోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ప్రాజెక్ట్ కే సినిమాలో ఎన్నో ట్విస్టులు ఉంటాయని ఆ ట్విస్టులు ఆడియన్స్ ను మెప్పించేలా ఉంటాయని సమాచారం అందుతోంది.టైమ్ ట్రావెల్ సైంటిఫిక్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.ప్రాజెక్ట్ కే సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రాజెక్ట్ కే సినిమా ప్రభాస్ అభిమానులకు విందు భోజనంలా ఉండనుందని తెలుస్తోంది.
div class=”middlecontentim

సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.ప్రాజెక్ట్ కే సినిమాను నాగ్ అశ్విన్ తన విజన్ తో ప్రేక్షకులకు సరికొత్తగా చూపించనున్నారని భోగట్టా.ప్రాజెక్ట్ కే సినిమాలో ప్రభాస్ మరో గ్రహంలోకి వెళతారని తెలుస్తోంది.
ప్రాజెక్ట్ కే సినిమాలో రానా( Rana ) కూడా కనిపిస్తారని ఆ క్యారెక్టర్ సినిమా స్టోరీ మొత్తాన్ని మార్చే క్యారెక్టర్ అని అందుకే డైరెక్టర్ ఆ క్యారెక్టర్ ను పరిచయం చేయకుండా సస్పెన్స్ గా ఉంచారని తెలుస్తుంది…ఇక ఈ సినిమా వైజయంతీ మూవీస్ బ్యానర్ లో చాలా ప్రెస్టీజియస్ మూవీగా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ప్రభాస్ సైతం తన భవిష్యత్తు సినిమాల ఫలితాల విషయంలో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం భారీ రేంజ్ లో ఉండనున్నాయని సమాచారం అందుతోంది…ఇక ఈ సినిమా 2024 సమ్మర్ కి వచ్చే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తుంది…
.







