కాంగ్రెస్ ని దెబ్బ తీయడానికే కేసీఆర్ ఎన్టీఆర్ జపం చేస్తున్నారా..?

ఈ మధ్యకాలంలో కేసీఆర్ ఎక్కడ చూసినా కూడా నందమూరి తారకరామారావు ( Nandamuri Taraka Rama Rao ) జపం చేస్తున్నారు.

ఇక ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే కేసీఆర్ (KCR) పాల్గొన్న ప్రతి బహిరంగ సభలో ఎన్టీఆర్ నామస్మరణ చేస్తున్నారు.అయితే ప్రతి సభలో ఎన్టీఆర్ జపం చేయడం వెనుక కేసీఆర్ పెద్ద ప్లాన్ వేశారని,ఈ ప్లాన్ ప్రకారమే ఆయన ప్రతిసారి ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నారని తెలుస్తోంది.

కేసీఆర్ ప్రస్తుతం తమకి గట్టి పోటీ ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమే అని భావిస్తున్నారు.ఇన్ని రోజులు బిజెపి అని అనుకున్నప్పటికీ బీజేపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది.

దాంతో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది.

Advertisement

ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బిఆర్ఎస్ ( BRS ) మధ్య 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అని కూడా పలు సర్వేలు చెబుతున్నాయి.ఇక ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ని దెబ్బ తీయడం కోసం ఎన్నో వ్యూహాలు రచిస్తున్నాడు గులాబీ దళపతి కేసీఆర్.ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో ఆకలి కేకలు వచ్చాయి.

అప్పట్లో ఎందుకు ఎన్టీఆర్ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పార్టీ పెట్టారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే ఎందుకు ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం పెట్టారు.

అంటూ ఇలా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు.

అంతేకాదు ఒకప్పుడు తెలంగాణలో టిడిపి బలంగా ఉండేది.కానీ రాష్ట్రం విడిపోయాక అక్కడక్కడ మాత్రమే కాస్త టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు,నేతలు ఉన్నారు.ఇక ఈసారి ఎన్నికల్లో టిడిపి అన్ని నియోజకవర్గాల్లో పోటీ ఉంటుంది అని చెప్పినప్పటికీ చంద్రబాబు జైల్లో ఉండడం వల్ల అది కుదరలేదు.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

అలాగే టీటీడీపీకి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ( Kasani Gnaneshwar Rao ) కూడా బీఆర్ఎస్ లో చేరారు.అయితే తెలంగాణలో ఉన్న టిడిపి ఓటర్లు చీలిపోయి కొంతమంది బిఆర్ఎస్ కి సపోర్ట్ ఇస్తే మరి కొంత మంది బిజెపి,కాంగ్రెస్ కి ఇలా తమకి నచ్చిన పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు.

Advertisement

అయితే టిడిపి ఓటర్లను సంపాదించుకోవడం కోసమే కెసిఆర్ ప్రతిసారి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రసంగాలు చేస్తున్నారు.అంతేకాదు ఎక్కడికి వెళ్లినా ఎన్టీఆర్ పేరు తలుస్తూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ ఏర్పడింది అనే విధంగా ప్రచారం చేస్తూ టిడిపి పార్టీ అభిమానులను తనవైపు తిప్పుకునేలా చేస్తున్నారు.

ఇదంతా కేసీఆర్ ఎన్నికల కోసం వాడే స్ట్రాటజీ అని కాంగ్రెస్ ని దెబ్బతీసి ఓటర్లను ఆకర్షించేందుకే కేసీఆర్ ప్రతిసారి ఎన్టీఆర్ (NTR) జపం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తాజా వార్తలు