ఖాళీ క‌డుపులో అల్లం నీరు తాగొచ్చా.. తాగ‌కూడ‌దా.. క‌చ్చితంగా తెలుసుకోండి!

అల్లం( ginger ) దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ వాడతారు‌.వివిధ రకాల వంటల్లో అల్లాన్ని వినియోగిస్తారు.

అలాగే ఇటీవల కాలంలో చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగడం అలవాటు చేసుకుంటున్నారు.సెలబ్రిటీలు( Celebrities ) కూడా ఇది ఫాలో అవుతుండడంతో.

సోషల్ మీడియాలో జింజర్ వాట‌ర్‌ బాగా ట్రెండ్ అవుతోంది.అయితే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగొచ్చా.? అసలు అలా తీసుకోవ‌డం ఆరోగ్యానికి మంచిదేనా.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.అల్లంలో విటమిన్ సి, కాల్షియం, ఐరన్, కాపర్, జింక్, మాంగనీస్ వంటి ముఖ్యమైన పోషకాలు మరియు విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.

పురాతన వైద్యం లో వివిధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి అల్లం ఒక మూలికగా ఉపయోగించేవారు.అందువ‌ల్ల ఖాళీ క‌డుపుతో అల్లం నీరు( Ginger water ) తాగితే లాభాలే త‌ప్ప ఎటువంటి న‌ష్టాలు ఉండ‌వు.

Advertisement

అల్లం వేసి మ‌రిగించిన నీటిని ఉద‌యం ఖాళీ క‌డుపుతో తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు పొందుతారు.

ముఖ్యంగా అల్లం నీరు సహజ రోగనిరోధక బూస్టర్‌గా పని చేస్తాయి.శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా బలపరుస్తాయి.అలాగే మ‌ధుమేహం( diabetes ) వ్యాధిగ్ర‌స్తుల‌కు అల్లం నీరు ఒక వ‌రం అనే చెప్పుకోవ‌చ్చు.

ఎందుకంటే, జింజ‌ర్ వాట‌ర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యానికి కూడా ప్రసిద్ధి చెందింది.ఖాళీ క‌డుపుతో అల్లం నీరు తాగ‌డం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గుతుంది.

గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

అంతేకాకుండా ఆర్థరైటిస్ ఉన్న వారికి అల్లం నీరు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పుల ఉపశమనానికి తోడ్ప‌డ‌తాయి.అల్లం నీరు శరీర కొవ్వును వేగంగా కాల్చేస్తుంది.

Advertisement

బ‌రువు త‌గ్గ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.మ‌రియు అల్లం నీరు తాగితే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం సైతం త‌గ్గుతుంది.

కాబ‌ట్టి ఖాళీ క‌డుపుతో అల్లం నీరు తాగ‌డానికి ఏ మాత్రం సంకోచించ‌కండి.

తాజా వార్తలు