పూరి జగన్నాథ్ ఇక సినిమాలు ఆపేయడం బెటరా..? ఎందుకు ఆయన ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు...

ఒకప్పుడు తనదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్లిన దర్శకుడు పూరి జగన్నాధ్.

ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ క్రియేట్ అవ్వడమే కాకుండా దానికి తగ్గట్టుగానే ఆయన చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ సక్సెస్ గా నిలవడం విశేషం.

ఇక యూత్ ని అట్రాక్ట్ చేసే డైలాగులు రాయడంలో ఆయన దిట్ట.అయితే రీసెంట్ గా ఆయన చేసిన సినిమాలేవి అంత పెద్దగా సక్సెస్ లను ఆయితే సాధించడం లేదు.

విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ను హీరోగా పెట్టి పాన్ ఇండియా సినిమాగా చేసిన లైగర్ (Liger) సినిమా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది.ఇక ఆ తర్వాత రామ్ ను హీరోగా పెట్టి ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ (sequel to Smart Shankar)గా చేసిన డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా డిజాస్టర్ అయింది.ఇక దాంతో ఒక్కసారిగా పూరి జగన్నాధ్ కెరియర్ అనేది మరోసారి డౌన్ ఫాల్ అయిందనే చెప్పాలి.

మరి ఇకమీదట ఈయన సినిమాలు చేయకపోవడమే బెటర్ అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు.

Advertisement

ఎందుకంటే ఈయన సినిమాల మీద ఏ మాత్రం ఎఫర్ట్ పెట్టట్లేదని కేవలం కాంబినేషన్ ను సెట్ చేయడం కోసమే సినిమాలను చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు అంటూ చాలామంది చాలా రకాల విమర్శలనైతే చేస్తున్నారు.మరి ఇలాంటి క్రమంలో పూరి జగన్నాథ్ (puri Jaganndh)మరోసారి సక్సెస్ సాధించి తనను తాను డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.ఇక తను కూడా రాబోయే సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నడా లేదంటే ఏదో అడపాదడప సినిమాలను చేసి రెస్ట్ తీసుకుందామని చూస్తున్నాడా అనే దాని మీదనే సరైన క్లారిటీ అయితే రావడం లేదు.

సినిమాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పై స్పందించిన పవన్!
Advertisement

తాజా వార్తలు