కొరటాల శివపై కోపంతో ఆచార్య సినిమాను బలి చేస్తున్నారా..?

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న చిత్రం ఆచార్య.

ఈ సినిమా ఈనెల 29వ తేదీ విడుదల కానుంది.

ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో పాటు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ నన్ను కూడా జరుపుకుంటుంది.ఇకపోతే గతకొద్దిరోజులుగా నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకుంటున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా నైజాం హక్కులను దిల్ రాజు కాకుండా వరంగల్ శీను సొంతం చేసుకున్నారు.ఇక దిల్ రాజు, వరంగల్ శీను మధ్య తీవ్రస్థాయిలో వివాదాలు ఉన్న సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఆచార్య సినిమా నైజాం హక్కులను గత ఏడాది వరంగల్ శీను అడ్వాన్స్ చెల్లించి సొంతం చేసుకున్నారు.

ఈ విధంగా నైజాం హక్కులను వరంగల్ శీను తీసుకోవడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది.కొరటాల శివ దిల్ రాజు మధ్య పరస్పర విభేదాలు ఉండటం వల్ల కొరటాల శివ ఈ సినిమా నైజాం హక్కులను దిల్ రాజుకు కాకుండా వరంగల్ శీను అప్పజెప్పారు.

Advertisement

ఈ క్రమంలోనే వరంగల్ శీను ఆచార్య సినిమా నైజాం హక్కులను 42 కోట్లు చెల్లించి కొనుగోలు చేశారు.

ఈ విధంగా వరంగల్ శీను భారీ మొత్తంలో ఆచార్య నైజాం హక్కులను కొనుగోలు చేశారు.ఇలా కొనుగోలు చేసిన అనంతరం ఈ సినిమాకు మంచి థియేటర్లు దొరకక పోయినా, అనుకున్న స్థాయిలో థియేటర్లు అందుబాటులో లేకపోయినా ఆచార్య సినిమా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఈ ప్రభావం ఆచార్య సినిమా వసూళ్లపై కూడా పడనుంది.

ఈ క్రమంలోనే కొరటాల శివ, వరంగల్ శీనులతో దిల్ రాజుకు ఉన్న గొడవల కారణంగా ఈ గొడవలు మెగాస్టార్ ఆచార్య సినిమాపై ప్రభావం చూపనున్నాయి ఏది ఏమైనా వీరి గొడవల కారణంగా ఆచార్య సినిమాను బలి చేస్తున్నారని చెప్పవచ్చు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు