ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిణామాలు శరవేగం గా కదులుతున్నాయి .రాష్ట్ర రాజకీయాలలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం అధినేత ను అరెస్టు చేసిన వైసిపి పాట నియమాలను చెరిపి వేసి కొత్త ఆటను స్టార్ట్ చేసింది.
ఇకపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంతకుముందు ఉన్నట్టుగా ఉండవని తాడో పేడో తేల్చుకోవాల్సిన స్థాయిలో పార్టీలు తలపడతాయి అన్న సంకేతాలు ఇప్పటికే వచ్చేసాయి అయితే మరో నెల రోజుల్లో ఇంతకు మించిన సంచలనం నమోదు అవుతుందని జోష్యం చెబుతున్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్( Vundavalli Aruna Kumar )రాష్ర్ట రాజకీయాలపై అప్పుడప్పుడూ తనదైన విశ్లేషణ చేసే ఉండవల్లి చంద్రబాబును అరెస్టు ను మించి జాతీయస్థాయిలో ఆ అరెస్టు సంచలనం రేపుతుందని, నేషనల్ మీడియా దృష్టి కూడా ఆంధ్రప్రదేశ్ పై ఉండే విధంగా పరిస్థితి మారుతుంది అంటూ చెప్పుకొచ్చారు.

దాంతో ఆ అరెస్టు ఎవరిదై ఉంటుందా అంటూ మీడియా లో స్పెక్యులేషన్స్ మొదలయ్యాయి .మార్గదర్శి( Margadarsi ) అవకతవకలపై దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న ఉండవల్లి ఒక దశలో మార్గదర్శిని ఇరుకున పెట్టగలిగినప్పటికీ అధికార పార్టీల అండతో ఇంత కాలం తప్పించుకుంటూ వస్తున్న రామోజీరావు( Ramoji Rao ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా స్పందించడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా చిట్ఫండ్ చట్టం నిబందనలు అతిక్రమించి వసూలు చేసిన మొత్తాలను ఇతర కంపెనీలకు మళ్ళిస్తున్నారని అంతేకాకుండా చిట్ఫండ్ చట్టానికి సంబంధించిన అనేక నిబంధనలు కూడా అతిక్రమించారని ఏపీ సిఐడి కేసులు పెట్టింది.
అనేక మంది బాధితులతో కూడా కేసులు పెట్టించింది .మార్గదర్శకేసులో చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసే దిశగా అన్ని ఆధారాలను సంపాదించిందని పూర్తిస్థాయి రిపోర్టును తయారుచేసుకుని ఆయనను అరెస్ట్ చేస్తుందని మీడియాతో పాటు అనేక వ్యాపార సంస్థలు ఉన్న ఈనాడు అధినేత రామోజీరావు అరెస్టు గురించే ఉండవల్లి మాట్లాడారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి.

ఆయన అయితేనే జాతీయ స్థాయిలో పలుకుబడి ఉన్నవ్యక్తి కావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం గా మారుతుందని ఆయన అరెస్టును దృష్టిలో పెట్టుకునే ఉండవల్లి అలా మాట్లాడి ఉంటారంటూ వార్తలు వస్తున్నాయి.మరి ఉండవల్లి జ్యోతిమవుతుందో లేదో మరో కొన్ని రోజులు ఎదురు చూస్తే తెలుస్తుంది.