ఏపీ కాపు సామాజిక వర్గం, నాయకుల్లో ఆయన ఫేమస్.టీడీపీలో కీలక నాయకుడు.
ఏ విషయమైనా ఆచితూచి అడుగులు వేయగల దిట్ట.అధికారం ఎక్కడ ఉంటే అక్కడే ఆయన ఉంటారన్న టాక్.
ఇంతలా గుర్తింపు పొందిన వారెవరంటే మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ అని చెప్పొచ్చు.ఇటీవవల కాపు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆయన రూటేసెపరేటు.
ఆయన రాజకీయ కదలికలపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
విశాఖ జిల్లాకు చెందిన ఆయన ఇటీవల టీడీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విశాఖ పార్లమెంట్ పర్టీ సమీక్షా సమావేశానికి ఆయన హాజరు కాలేదు.
దీంతో పెద్ద ఎత్తున పార్టీ మారతాడా ? అనే ఊహాగానాలు వెల్లువెత్తాయి.ఇదే క్రమంలో ఆయన వైసీపీ వైపు పావులు కదుపు తున్నట్టు తెలిసింది.
అయితే ఇవేమీ నిజం కాదని పలువురు అంటున్నారు.ప్రస్తుతం రాజకీయ సంధిని తన భుజస్కంధాలపై వేసుకున్నట్టు తెలిసింది.
జగన్‌ను ఓడించి అధికారంలోకి రావాలంటే ఒక్క టీడీపీతో అయ్యేపని కాదని భావిస్తున్నట్టు సమాచారం.మరోవైపు జనసేన ఎంత పుంజుకున్నా ఏపీలో ఒంటరిగా పోటీ చేసి గెలవడం అంత సులువేమీ కాదు.
కాపుల కోసం కొత్తగా పార్టీ ఏర్పాటు చేసినా ఎన్నికలు వచ్చే రెండేండ్ల వ్యవధిలో అధికార వపక్షాలను ఢీకొడుతుందా ? అంటే కష్టమే.ఇవన్ని గంటా ఆలోచించి తగు నిర్ణయం తీసుకుంటున్నాడని తెలుస్తోంది.
అయితే ఏపీలో టీడీపీకి గ్రౌండ్ లెవల్ దాకా క్యాడర్ ఉంది.అలాగే బాబు రాజకీయ వ్యూహాలు మెరుగ్గా ఉన్నాయి.ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి కాపు సామాజిక వర్గం బలం ఉంది.ఇప్పుడు టీడీపీ జనసేన కలిసిపోతే 2024 లో ఏపీ రాజకీయాలే మారిపోతాయని గంటా భావిస్తున్నారట.
అందుకే రెండు పార్టీలు కలవాలని ఆకాంక్షిస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.ఒకవేళ రెండు వైపులా సానుకూల వాతావరణం ఉంటే గంటానే మధ్యవర్థిత్వం చేసేందుకు రంగం సిద్ధమనే భావనలో ఉన్నట్టు తెలిసింది.
గతంలోనే ప్రజారాజ్యం పార్టీలో ఆయన ఒకరుగా కీలకంగా ఉన్నారు.పవన్ కళ్యాన్‌తోనూ తత్సంబంధాలు ఉన్నాయి.
చిరంజీవి కుటుంబంతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.కాబట్టి జనసేనతో చర్చలు జరిపి బాబుతో మాట్లాడి పార్టీలను కలిపే యోచనలోనూ ఉన్నట్టు తెలిసింది.
గంటాకు ఉన్న సన్నిహిత సంబంధాలతో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చే పనిలో ఉండడం, వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌కు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారని టాక్.మరి ఆయన సంధి మార్గం ఏమేర ఫలితాలు ఇస్తుందో చూడాల్సిందే
.