తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్లీ పుంజుకునేలా చేసింది రేవంత్ రెడ్డి ( Revanth reddy ) అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అయితే రాష్ట్రం మొత్తం తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ఎంత శ్రమ పడ్డారో కొడంగల్ లో రేవంత్ రెడ్డిని గెలిపించడానికి మరో వ్యక్తి కూడా అంతే శ్రమ పడ్డారట.
అంతేకాదు కొడంగల్ లో రేవంత్ రెడ్డి గెలిచారు అంటే దానికి కారణం ఆయన పట్టుదల, శ్రమ అని తెలుస్తుంది.ఇక రేవంత్ రెడ్డిని కొడంగల్ ( Kodangal ) లో ఎమ్మెల్యేగా గెలిపించింది ఎవరో కాదు రేవంత్ రెడ్డి సొంత అన్న తిరుపతిరెడ్డి.
తమ్ముడు రాష్ట్ర మొత్తం కలియ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి సర్వశక్తుల ప్రయత్నిస్తే తమ్ముడిని కొడంగల్లో గెలిపించడానికి తిరుపతిరెడ్డి చేయని పని అంటూ లేదు.అంతే కాదు ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కావడంతో సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్,హరీష్ రావు అలాగే బీజేపీ పార్టీ వాళ్లు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

ఇక వీరందరూ కేవలం రేవంత్ రెడ్డి పై మాత్రమే కాకుండా రేవంత్ రెడ్డి అన్న తిరుపతిరెడ్డి ( Thirupathi reddy ) పైన కూడా స్పెషల్ ఫోకస్ చేశారట.ఆయన ఏం చేస్తున్నారు ఎక్కడ తిరుగుతున్నారు అనేవి అన్ని పసిగట్టారట.అయినప్పటికీ ఎవరు ఎన్ని విధాలుగా టార్గెట్ చేసినా కూడా తిరుపతిరెడ్డి తన తమ్ముడి గెలుపే ధ్యేయంగా ముందుకు వెళ్లారు.అలాగే కొడంగల్ నుండి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారి దగ్గరికి వెళ్లి తన తమ్ముడికి ఓట్లు వేయాలని చెప్పి ఎన్నికలు రేపు అనగా వారిని కొడంగల్ కి తీసుకువచ్చి స్వయంగా ఓట్లు వేయించారు.

ఇక మొదట కొడంగల్ లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత మల్కాజ్ గిరి ( Malkajgiri ) నుండి ఎంపీగా గెలిచినప్పటికీ కొడంగల్ ప్రజలను మాత్రం వదిలి పెట్టలేదు.మరీ ముఖ్యంగా తన తమ్ముడు అక్కడ ఉన్నా లేకపోయినా కూడా తన తమ్ముడి తరఫున తిరుపతి రెడ్డి అన్ని తానే అయి చూసుకున్నారు.కొడంగల్ లో పార్టీ నాయకులను అలాగే కార్యకర్తలను కూడా తిరుపతిరెడ్డి చూసుకున్నారు.వారి సమస్యలన్నింటిని తెలుసుకొని మరీ వాటన్నింటినీ తీర్చారు.అయితే కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడించడానికి సీఎం కేసీఆర్ ( KCR ) ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ తిరుపతిరెడ్డి వాటన్నింటిని తిప్పి కొట్టారని చెప్పవచ్చు.ఒకరకంగా ప్రస్తుతం సీఎం సీటు లో రేవంత్ రెడ్డి కూర్చోవడానికి కారణం కొడంగల్ లో ఎమ్మెల్యేగా గెలవడం అయితే ఆ గెలవడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి అన్నయ్య తిరుపతిరెడ్డి అయ్యారు.