మధుమేహం ఉన్నవారు నెయ్యి తింటే ఏమవుతుందో తెలుసా?

మధుమేహం ఉన్నవారు నెయ్యి తినవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.ఈ మధ్య జరిగిన పరిశోధనల ప్రకారం మధుమేహం ఉన్నవారు కూడా నెయ్యి తినవచ్చు.

అయితే మోతాదు మించకూడదు.మరో ముఖ్య విషయం ఏమిటంటే ఇంటిలో తయారుచేసిన నెయ్యి అయితే చాలా మంచిది.

Do People With Diabetes Know What Happens When They Eat Ghee , Ghee, Diabetes, R

ఒకవేళ ఇంటిలో తయారుచేసిన నెయ్యి లేకపోతే ఆర్గానిక్ నెయ్యిని మార్కెట్ లో కొనుగోలు చేయాలి.ఇప్పుడు నెయ్యి తింటే మధుమేహం వారికి ఎన్ని లాభాలు చేకూరతాయో తెలుసుకుందాం.

అన్నం,బ్రేడ్ వంటివి తిన్నప్పుడు వాటిలో ఉండే పిండి పదార్ధం కారణముగా రక్తంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతూ ఉంటాయి.ఆలా కాకుండా అన్నంలో నెయ్యి వేసుకొని తింటే షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.

Advertisement

శరీరంలో ఉండే చెడు కొలస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలస్ట్రాల్ ని పెంచుతుంది.దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.

నెయ్యి తింటే చాలా మంది కొలస్ట్రాల్ పెరుగుతుందని భావిస్తారు.కాని నిజానికి నెయ్యి కొవ్వును కరిగించటంలో సహాయపడుతుంది.

సాధారణంగా మధుమేహం ఉన్నవారిలో జీర్ణ సంబంధమైన సమస్యలు ఉంటాయి.వీరిలో ముఖ్యంగా మలబద్దకం సమస్య ఉంటుంది.

వీరు అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే జీర్ణ సమస్యలు తొలగిపోయి సాఫీగా విరేచనం అవుతుంది.నెయ్యిలో సమృద్ధిగా ఉండే లినోలీయిక్ యాసిడ్ మధుమేహ వ్యాధిగ్రస్తులలో గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.

పెళ్ళైన వాడితో ప్రేమలో పడ్డ హీరోయిన్ కుష్బూ..ఇందులో నిజమెంత.. ?

కాబట్టి మధుమేహం ఉన్నవారు నెయ్యిని లిమిట్ గా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Advertisement

తాజా వార్తలు